తన పిల్లల తండ్రిని 12 ఏళ్ల తర్వాత వెదికి పట్టుకున్న తల్లి

  • 20 జనవరి 2019
ఆరోన్

స్వలింగ సంపర్కురాలైన జెస్సికా తనకూ ఒక కుటుంబం కావాలనుకుంది. తల్లి కావాలని స్పెర్మ్ బ్యాంక్ నుంచి వీర్యం తెచ్చుకుంది.

కానీ దశాబ్దం తర్వాత అదే డోనర్‌ను తాను కలుస్తానని, అతడితో ప్రేమలో పడతానని అప్పుడు ఊహించలేకపోయింది.

నేను, నా గాళ్ ఫ్రెండ్ మొదటి నుంచీ కలిసే ఉంటున్నాం. అందుకే, నాకు 2005లో పెద్ద పాప పుట్టినపుడు నేను తల్లి అయిన తొలి స్వలింగ సంపర్కురాలిని అయ్యాను. అమెరికా మిడ్‌వెస్ట్‌లో స్వలింగ సంపర్కులు అందరికీ తమ భాగస్వాముల వల్ల పుట్టిన పిల్లలు ఉన్నారు.

మేమిద్దరం మాకు పిల్లలు కావాలని అనుకున్నాం. లక్కీగా మా కోసమే పెట్టారా అన్నట్లు, మా ఇంటికి దగ్గరగా ఒక స్పెర్మ్ బ్యాంక్ వచ్చింది. అక్కడ చాలా మంది డోనర్లు రిజిస్టర్ అయ్యేవారు.

ఇంటి దగ్గరే ఉండి డిగ్రీ కోసం చదువుకుంటూ ఉండడంతో మొదటి బిడ్డను నేనే కనాలని అనుకున్నా. అప్పట్లో నా పార్ట్‌నర్ నాకు భార్యలా ఉండేది.

ఎవరైనా ఒడ్డూపొడుగూ బాగా ఉండి, సాహిత్యం, క్రీడలు అంటే ఇష్టం ఉన్న వ్యక్తి వీర్యం ద్వారా బిడ్డను కనాలని మేం నిర్ణయించాం.

డోనర్ల లిస్టులో వృత్తిపరంగా క్యాబ్ డ్రైవర్, రచన, సంగీతం అంటే ఇష్టం ఉన్న ఒక వ్యక్తిని మేం ఎంచుకున్నాం. అతడి గురించి వివరాలు తెలుసుకున్నాం కానీ, అతడి ఫొటోను మాత్రం చూళ్లేదు.

స్పెర్మ్ బ్యాంక్ నుంచి వీర్యాన్ని ఇంటికే సప్లై చేసేవారు. అలా ఏడు నెలల తర్వాత నేను గర్భం ధరించా. అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.

Image copyright Getty Images

విడిపోయిన బంధం

తర్వాత అలిస్ పుట్టింది. చాలా ముద్దుగా ఉండేది. కొన్నిరోజుల తర్వాత అలిస్‌కు తనలాగే ఉండే తమ్ముడినో, చెల్లినో ఇవ్వాలనుకున్నాం.

దాంతో మళ్లీ అదే డోనర్ వీర్యం కోసం ఆర్డర్ చేశాం. ఈసారీ మా రెండో బిడ్డకు నా భార్య జన్మనిచ్చింది. అలిస్‌ ఏడాదిన్నర వయసులో ఉన్నప్పుడు రెండో పాప పుట్టింది.

పిల్లలిద్దరూ చాలా బాగా కలిసి ఉండేవారు. మా ఇద్దరినీ కూడా అర్థం చేసుకున్నారు. డోనర్ వివరాల్లో ఉన్నట్టే ఇద్దరూ చాలా పొడుగ్గా ఉండేవారు. కన్నూ,ముక్కూ చక్కగా ఉండేవి.

చిన్న పాపకు ఏడాది రాగానే, మా మధ్య ఎలాంటి గొడవలూ లేకపోయినా నా భార్య మా బంధం నుంచి విడిపోతున్నట్లు చెప్పింది.

నా గుండె ముక్కలైంది. ఎంత చెప్పినా మా వివాహ బంధాన్ని మళ్లీ చక్కదిద్దుకోలేకపోయాం. నేను వారానికి ఐదు రోజులు పిల్లల్ని చూసుకునేదాన్ని.

కానీ అలిస్‌కు పదేళ్ల వయసులో నా మాజీ భార్య తన ఫోన్ బ్లాక్ చేసింది. మమ్మల్ని దూరంగా ఉంచేసింది. సెలవుల్లో అలిస్ తన చెల్లెల్ని కూడా కలవకుండా దూరం చేసింది.

తోడు కోసం తపన

అలిస్‌కు ఆ లోటు ఇప్పటికీ ఉంది. తన చెల్లెల్ని చూడాలని కలలు కనేది.

ఒకసారి అలిస్ తన పూర్వీకులు ఎవరో తెలుసుకోవాలని, తన జన్యువుల వివరాలు సేకరించాలని అనుకుంది. 11 ఏళ్ల వయసులో తన అమ్మమ్మను అడిగి డీఎన్ఏ టెస్టింగ్ కిట్ తెప్పించుకుంది.

డీఎన్ఏ టెస్ట్ ఫలితాలు 8 వారాల తర్వాత వచ్చాయి. వెబ్ సైట్ డీఎన్ఏ సంబంధీకుల సెక్షన్లో నేను క్లిక్ చేస్తున్నప్పుడు ఏ వివరాలూ రావనే అనుకున్నా.

కానీ అందులో "ఆరోన్ లాంగ్ 50 శాతం. తండ్రి", "బ్రైస్ గాలో 25 శాతం. సవతి సోదరుడు" అని వచ్చింది.

తర్వాత ఆ సైట్‌కు నోట్ రాయడానికి ముందు ఇంటర్నెట్లో ఆరోన్ కోసం వెతికాను. అందులో ఎంతోమంది కనిపించారు.

తర్వాత నేను ప్రొఫెషనల్ సోషల్ నెట్‌వర్క్‌లో ఆరోన్ క్లూస్ కోసం వెతికాను. అదే పేరు, ఆ వయసు రేంజిలో లిటరేచర్‌లో మాస్టర్ డిగ్రీ చేసిన ఒకే ఒక వ్యక్తి కనిపించాడు.

ఇంటర్నెట్ కలిపింది ఇద్దరినీ...

ఫొటోలో ఆరోన్ ట్రంబోన్ ఊదుతూ ఉన్నాడు. ప్రొఫైల్లో ఆయనొక కన్యూనికేషన్స్ స్పెషలిస్ట్ అని, సీటెల్‌లో ఉంటాడని ఉంది. ఆయన రచయిత, సంగీత కళాకారుడు కూడా.

ఇంకో సోషల్ మీడియా సైట్‌లో సీటెల్‌లో ఆరోన్ లాంగ్ పేరుతో ఉన్న పేజిలో అతడి చాలా ఫొటోలు నిపించాయి. సందేహం లేదు.. నా కూతురి ముఖం అచ్చుగుద్దినట్టు అలాగే ఉంటుంది.

వెంటనే అతడికి మెసేజ్ పెట్టా.. నా ఇద్దరు కూతుళ్లూ నీలాగే ఉంటారు.( నా చిన్న కూతురు నా మాజీ భార్య దగ్గర ఉంది. తన పేరు డీఎన్ఏ సైట్‌లో లేదు). నీకు మా ఫామిలీ ఫొటోలు చూడాలనిపిస్తే, మేం అందుబాటులో ఉంటాం. అని రాశా.

తర్వాత తను మాతో ఫ్రెండ్ అవడానికి రెడీ అన్నాడు. తన గురించి 50 పేజీల వివరాలు పంపించాడు. అందులో అతను మేం ఉన్న టౌన్లోనే ఒక బ్యాండ్‌లో ఎన్నో ఏళ్ల పాటు పనిచేశాడని తెలిసింది.

ఒకే చోట నివసించిన మేం, సూపర్ మార్కెట్లో, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు పక్కపక్కనే ఉన్నామో అనే ఊహ వచ్చింది.

అలిస్ సవతి తమ్ముడు బ్రైస్‌కు కూడా నేను లెటర్ రాశాను. తను అప్పుడే కాలేజ్ చదువు పూర్తి చేశాడు.

ఒకరికి బదులు ఇద్దరు దొరికారు

బ్రైస్ తనకు 19 ఏళ్ల మాడీ అనే తన సవతి సోదరి కూడా ఉందని చెప్పాడు. తనకు వేరే తల్లిదండ్రులు కూడా తెలుసని, అందరి దగ్గరా కలిపి ఆరోన్ వల్ల పుట్టిన ఆరుగురు పిల్లలు ఉన్నారని చెప్పాడు.

అంటే మా ఇద్దరు పిల్లల నంబర్ ఏడు, ఎనిమిది.. కానీ అంత మంది పిల్లల్లో బ్రైస్, మాడీ మాత్రమే అలిస్‌తో బంధం ఏర్పరుచుకోడానికి సిద్ధమయ్యారు.

చెల్లి దూరం అయినందుకు బాధపడిన అలిస్‌కు ఇప్పుడు ఇద్దరు తోడు దొరికారు.

కొన్ని నెలల తర్వాత బ్రైస్, మాడీ సీటెల్‌లో ఉన్న ఆరోన్‌ను కలవాలనుకున్నారు. అలిన్‌కు కూడా వాళ్లిద్దరూ తనలాగే ఉంటారేమో చూడాలని ఆతృతగా ఉంది.

దాంతో నేను కూడా పాపను తీసుకుని సీటెల్ వెళ్లాను.

ఆరోన్ ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. తన స్నేహితులను, బంధువులను అందరినీ ఆహ్వానించాడు.

డోనర్‌పై చిగురించిన ప్రేమ

అదే రోజున కలిసిన పిల్లలు ఒకర్నొకరు చూసుకుని సంతోషంలో మునిగిపోయారు. బాగా కలిసిపోయారు. ఆ పార్టీని ఎంజాయ్ చేశారు.

అప్పుడే నాకు కూడా "నా పిల్లలకు ముఖ్యమైన ఆరోన్ నాకూ కావల్సిన వాడేగా" అనిపించింది. ఒక రాత్రి అతడితో కాసేపు నడిచే అవకాశం దొరికింది.

ఒక ఆడ, మగ ప్రేమలో పడితే వారి మధ్య పరస్పరం ఒక ఆరాధనాభావం ఏర్పడుతుంది. నేను అచ్చం అతడిలాగే ఉన్న పిల్లలతో దశాబ్దం పాటు జీవించాను. ఇప్పుడు తనతో కూడా కలిసి ఉండాలనిపిస్తోంది.

ఆరోన్ నవ్వు, అతడి కళ్లు నా చిన్న కూతురిని గుర్తు చేశాయి. అతడితో ప్రేమలో పడేలా చేశాయి.

ఒక డీఎన్ఏ మా మధ్య ఒక బంధం ఏర్పడడానికి కీలకం అయ్యింది. చివరకు అతడంటే ఇష్టాన్ని కలిగించింది.

ఏళ్ల క్రితం స్పెర్మ్ డోనర్ లిస్టులో అతడి పేరు ఎంచుకోవడం తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తోంది.

ఒక డోనర్-67 మంది పిల్లలు

ఆరోన్ చాలా మంచి వాడు, కథలు రాస్తాడు, సంగీత పరికరాలు వాయిస్తాడు. ఒక క్యాబ్ నడిపే వ్యక్తిలో ఇన్ని ప్రత్యేకతలు ఉంటాయని, ఎవరూ ఊహించలేరు.

అలిస్, నేను 2017లో ఆరోన్ ఇంటికి వెళ్లిపోయాం. ఆ ఇల్లు చాలా పెద్దది. తర్వాత నేను తల్లిగా మారాను. ఆరోన్ అమ్మ కూడా మాతో కలిసి ఉండడానికి వచ్చేశారు.

ఎప్పుడో ఒక స్పెర్మ్ ల్యాబ్ పేజీలో ఎంచుకున్న డోనర్ ఇప్పుడు నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు.

బయట ఆరోన్ వల్ల పుట్టిన పిల్లలు ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. తను మాత్రం లెక్క ప్రకారం వారి సంఖ్య 67 మందికి పైనే ఉంటుందని చెబుతాడు.

వారందరూ వచ్చినా ఆహ్వానించడానికి తను సిద్ధంగా ఉంటాడు. మేం ఉంటున్న బిల్డింగ్ కూడా వాళ్లందరూ వచ్చినా సరిపోయేలా ఉంటుంది. వారికోసం దాని తలుపులు కూడా తెరిచే ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలపై అసదుద్దీన్ ఒవైసీ ఏమంటున్నారు?

కసబ్ దగ్గర హైదరాబాద్ కాలేజ్ ఐడీ, బెంగళూరు ఇంటి అడ్రస్: రాకేశ్ మారియా

రాజస్థాన్‌లో దళిత యువకులపై దాడి: 'మర్మాంగాల్లో పెట్రోల్ పోసి హింసించారు'

టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020: భారత జట్టు చరిత్ర సృష్టిస్తుందా

జీరో పేషెంట్ అంటే ఏంటి.. కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు.. తెలుసుకోవడం వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా

ఇతనో దొంగ.. ఒక బీరువాను దొంగిలించాడు.. అది ఇతని జీవితాన్ని మార్చింది

డోనల్డ్ ట్రంప్‌కు నది శుభ్రంగా కనిపించేలా, యమునలో నీళ్లు వదిలారు

స్కేటర్ సాయి సంహిత: "క్రీడల్లోకి రావడానికి అమ్మాయిలు భయపడకూడదు"