వృద్ధులను, వికలాంగులను సొంత కాళ్లపై నిలబెట్టే స్మార్ట్ ట్రౌజర్లు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వృద్ధులను, వికలాంగులను సొంత కాళ్లపై నిలబెట్టే స్మార్ట్ ట్రౌజర్లు

  • 28 జనవరి 2019

వికలాంగులు, వృద్ధులతోపాటు, కదలడంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఇతరులు కింద పడిపోకుండా, ఎక్కువసేపు సొంతంగా నిలబడేందుకు తోడ్పడే స్మార్ట్ ట్రౌజర్లను బ్రిటన్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు.

కృత్రిమ కండరాలతో కూడిన ఈ స్మార్ట్ ట్రౌజర్లు రోబోటిక్ క్లాతింగ్ కిందకు వస్తాయి. శరీర కదలికలకు స్మార్ట్ ట్రౌజర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి సౌకర్యంగా ఉంటాయి. వాడటం సులభం.

నడుం చుట్టూ, ట్రౌజర్ల చుట్టూ ఉండే కృత్రిమ కండరాల సాయంతో ఇవి పనిచేస్తాయి. ఇవి పరిమాణాన్ని మార్చుకోగలవు. అవసరమైతే పెద్దవిగా మారతాయి. వీటిని విప్పేయడం కూడా తేలికే.

'ద రైట్ ట్రౌజర్స్'ప్రాజెక్టు కింద ఈ రోబోటిక్ ట్రౌజర్లను తయారుచేశారు. 'ద రాంగ్ ట్రౌజర్స్' సినిమాను దృష్టిలో ఉంచుకొని 'ద రైట్ ట్రౌజర్స్'పేరు పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)