వీడియో: కాఫీ కనుమరుగవుతుందా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: 2080 నాటికి కాఫీ దొరకడం కష్టమేనా?

  • 28 జనవరి 2019

కాఫీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందా? అంటే, జాగ్రత్తపడకుంటే ఆ పరిస్థితి వస్తుందని తాజాగా జరిగిన అధ్యయనం.

కాఫీ మొక్కల్లో దాదాపు 60% రకాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఏటికేడు కాఫీ వినియోగం భారీగా పెరిగిపోతోంది. ఓ అధ్యయనం ప్రకారం రోజూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 200 కోట్ల కప్పుల కాఫీ తాగుతున్నారు. 2.5 కోట్ల కుటుంబాలు కాఫీ తోటల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నాయి.

2000 నుంచి 2015 మధ్య కాలంలో కాఫీ వాడకం 43 శాతం పెరిగింది. అయితే, కాఫీ వినియోగం పెరిగిపోతోంది కానీ, కాఫీ తోటలు మాత్రం అంతరించిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)