గడ్డకట్టే చలిలో.. ఆమ్లెట్ ఎలా వేస్తున్నారో చూశారా?

  • 4 ఫిబ్రవరి 2019
అమెరికాలో చలి Image copyright SOCIAL MEDIA

ఎముకలు కొరికే చలికి అమెరికాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్ డీగ్రీల్లోకి పడిపోతున్నాయి. దాంతో, ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాకుండా ఉంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వందల సంఖ్యలో విమానాలను రద్దు చేశారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక న్యూయార్క్‌లో

ఈ చలి వల్ల ఇళ్లు లేనివారు ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు. దాంతో వారికోసం నగరాల్లో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అనేక మంది అనారోగ్యం బారిన పడుతుండటంతో ఆస్పత్రుల్లో అత్యవసర సేవల విభాగాలు ఏర్పాటు చేశారు. ఈ చలి ప్రభావంతో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంచనా.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక షికాగో తీరం ఇలా గడ్డకట్టింది.

దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఈ చలి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు.

షికాగో, డెట్రాయిట్‌, మినియాపోలిస్‌, మిల్వాకీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. మిన్నెసోటా రాష్ట్రంలోని కాటన్ టౌన్‌షిప్‌లో గురువారం అత్యల్పంగా మైనస్ 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. షికాగో నది గడ్డకట్టింది.

రైలు పట్టాల మీద పేరుకుపోయిన మంచును కరిగించేందుకు గ్యాస్‌తో మంట పెడుతున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: అందరూ వణికిపోతుంటే.. మరికొందరు ఎంజాయ్ చేస్తున్నారు

అయితే, తీవ్రమైన చలిలో అనేకమంది వణికిపోతుంటే.. కొందరు మాత్రం ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)