ఐఎన్ఎఫ్ ఒప్పందానికి గుడ్ బై చెప్పిన అమెరికా... సరికొత్త క్షిపణులు చేస్తామన్న రష్యా

  • 6 ఫిబ్రవరి 2019
రష్యా
చిత్రం శీర్షిక సరికొత్త క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్న రష్యా

అమెరికా-రష్యా దేశాల మధ్య ఉన్న ఆయుధ నియంత్రణ ఒప్పందం రద్దయ్యింది. ఈ పరిణామాల అనంతరం, సరికొత్త 'క్షిపణి వ్యవస్థ'ను అభివృద్ధి చేస్తామని రష్యా ప్రకటించింది.

స్వల్ప, మధ్యస్థ పరిధిలోని లక్ష్యాలను చేధించే భూతల క్షిపణులను వాడబోమంటూ, ఇరు దేశాలు గతంలో ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్(ఐఎన్ఎఫ్) ఒప్పందం చేసుకున్నాయి.

ఐఎన్ఎఫ్ ఒప్పందం ఉల్లంఘిస్తున్నారంటూ అమెరికా, రష్యాలు చాలాకాలంగా పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు డోనల్డ్ ట్రంప్ గతవారం ప్రకటించారు. దాంతో, రష్యా కూడా ఆ పనే చేసింది.

ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నప్పుడు 1987లో రష్యా-అమెరికా దేశాలు ఐఎన్ఎఫ్ మీద సంతకాలు చేశాయి. యూరప్ దేశాల రాజధానులకు అమెరికా, రష్యా క్షిపణులు గురిపెట్టి ఉన్న సందర్భంలో ఉద్రిక్త వాతావరణాన్ని సడలించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

Image copyright BBC Sport

రష్యా ప్రణాళిక ఏమిటి?

రానున్న రెండేళ్లలో అధునాతన భూతల క్షిపణులను తయారుచేయడమే తమ లక్ష్యమని, మంగళవారంనాడు రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయ్‌గు తెలిపారు.

ఐఎన్ఎఫ్ ఒప్పందం ప్రకారం, భూతల క్షిపణుల వాడకంపై నిషేధం ఉంది కానీ గగనతల, జలాంతర క్షిపణులపై నిషేధం లేదు. ఈ రెండు రకాల క్షిపణులను ఇప్పటికే రష్యా కలిగివుంది.

''ఐఎన్ఎఫ్ ఒప్పందాన్ని మెరికా ఉల్లంఘించింది. 500కి.మీ. లక్ష్యాన్ని చేధించగలిగిన భూతల క్షిపణులను తయారు చేస్తోంది. ఇందుకు ప్రతిగా అమెరికాకు గుణపాఠం నేర్పడానికి, రష్యా అధ్యక్షుడు మాకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు'' అని రష్యా రక్షణ శాఖ మంత్రి అన్నారు.

రష్యా ప్రకటనపై అమెరికా ఇంకా స్పందించలేదు. కానీ, ఐఎన్ఎఫ్ ఒప్పందంలో భాగంగా నిషేధానికి గురైన క్షిపణుల ప్రయోగం గురించి ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని, గతవారం అమెరికా అధికారులు తెలిపినట్లు ఎ.పి.వార్తాసంస్థ పేర్కొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫిబ్రవరి 1, 2019న ఐఎన్ఎఫ్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తున్న అమెరికా సెక్రెటరీ మైక్ పాంపేయో

అమెరికా ఎందుకు విరమించుకుంది?

రష్యా, చైనా దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది.

ముఖ్యంగా, 500-5,500 కి.మీ. లక్ష్యాలను చేధించగలిగే భూతల క్షిపణులను తయారు చేసి, ఐఎన్ఎఫ్ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించిందని, అందుకే ఈ ఒప్పందం నుంచి తాము పూర్తిగా విరమించుకుంటున్నట్లు అమెరికా తెలిపింది.

''రష్యాతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి, అణ్వాయుధాల నియంత్రణ విషయంలో మేం మాత్రమే ఒంటరి ప్రయాణం సాగించలేం'' అని డోనల్డ్ ట్రంప్ అన్నారు.

కానీ రష్యా వాదన మరోలా ఉంది. ఈ ఒప్పందాన్ని తొలుత ఉల్లంఘించింది అమెరికాయేనని, ఐఎన్ఎఫ్ నుంచి వైదొలగేందుకే ఇలా ఆరోపణలు చేస్తూ వ్యూహం రచిస్తోందని రష్యా పేర్కొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రష్యా రూపొందించిన 9M729 క్షిపణి.

‘రష్యా నుంచి ప్రమాదం పొంచివున్న మాటలో వాస్తవం ఎంత?’ - బీబీసీ ప్రతినిధి జొనాథన్ మార్కస్ అభిప్రాయం:

9M729 లేదా SSC-8 భూతల క్షిపణులను తయారుచేసి, రష్యా ఐఎన్ఎఫ్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెరికా చెబుతోంది. రష్యా అమ్ములపొదిలోకి ఈ క్షిపణులు వచ్చి చేరడంతో, ప్రపంచదేశాల మధ్య నెలకొన్న ఆయుధపోరులో రష్యా చాలా ముందుకు వెళ్లినట్లే.

ఇలాంటి క్షిపణులు రష్యావద్ద 100 వరకు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వాటితోపాటు ప్రస్తుతం రష్యా నౌకాదళ క్షిపణి 'కలీబ్రు'ను పోలిన భూతల క్షిపణిని కూడా తయారు చేయడం గురించి అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతున్నారు. చాలాకాలంగా అమెరికా ఆరోపిస్తూవచ్చిన 'హైపర్‌సోనిక్ ఆయుధం' గురించి కూడా పుతిన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు.

మరోవైపు సరికొత్త క్షిపణులపై అధ్యయనం చేయడానికి, అభివృద్ధి చేయడానికి అమెరికా నిధులను కేటాయించింది.

ఈ ఆయుధ పోరు యూరప్ దేశాల మధ్య కంటే, ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. రష్యా-అమెరికా దేశాలకు చైనా గట్టి పోటీ ఇవ్వగలదు. ఎందుకంటే, ఆయుధ నియంత్రణ అంశంలో చైనాకు ఎప్పుడూ, ఎలాంటి ఒప్పందమూ అడ్డంకి కాలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఐఎన్ఎఫ్ ఒప్పందంపై 1987లో సంతకాలు చేస్తున్న రష్యా, అమెరికా నేతలు

ప్రధాన ఘట్టాలు

  • 1987లో రష్యా-అమెరికా దేశాల మధ్య ఐఎన్ఎఫ్ ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం, మధ్యస్థ, సమీప లక్ష్యాలను చేధించగలిగే అణ్వాయుధాలతోపాటు అన్నిరకాల క్షిపణులపై నిషేధం ఉంది.
  • SS-20 క్షిపణులను రష్యా తయారు చేసినపుడు, అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా చర్యలకు ప్రతిచర్యగా, అమెరికా కూడా తన ఐరోపా భూభాగంలో క్షిపణులను రంగంలోకి దించింది. ఈ పరిణామాలతో.. అప్పుడు పెద్దఎత్తున నిరసనలు కూడా జరిగాయి.
  • 1991నాటికి మొత్తం 2,700 క్షిపణులను ధ్వంసం చేశారు.
  • పరస్పరం ఒకరి ఆయుధాలను మరొకరు తనిఖీ చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
  • రష్యా ఆశయాలను నెరవేర్చేలా ఒప్పందం లేదని 2007లో పుతిన్ ప్రకటించారు.
  • బాల్లిస్టిక్ క్షిపణుల విరమణ ఒప్పందం నుంచి 2002లో అమెరికా బయటకు వచ్చింది. ఆ తర్వాత, తాజా పరిణామాలకు బీజం పడింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు.. ఎంపీల ‘విలీనం’పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న టీడీపీ

ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది వలస.. 70 ఏళ్లలో ఇదే అత్యధికం - యుఎన్‌హెచ్‌సీఆర్

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు