వీడియో: ఈ చిన్నారికి ఛాతి ఎముక లేదు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: ఈ చిన్నారికి ఛాతి ఎముక లేదు

  • 12 ఫిబ్రవరి 2019

యూకేకు చెందిన వానిలోప్ విల్కిన్స్ అనే చిన్నారికి ఛాతి ఎముక లేదు. దాంతో పుట్టుకతోనే ఆమెు గుండె శరీరం వెలుపల ఉంది.

ఈ చిన్నారి తల్లి కడుపులో ఉండగానే, గుండె శరీరం బయట ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లలో విల్కిన్స్ గుండె శరీరం వెలుపల కొట్టుకుంటున్నట్లు స్పష్టంగా కనిపించింది.

చిన్నారి బతికే అవకాశాలు 10 శాతం కూడా లేవని వైద్యులు చెప్పారు.

పుట్టిన వెంటనే చిన్నారిని శస్త్ర చికిత్స కోసం యూకేలోని లెస్టర్ నగరానికి తరలించారు.

మూడు శస్త్ర చికిత్సలు చేసి వైద్యులు ఆ గుండెను శరీరం లోపల అమర్చారు. పుట్టినప్పటి నుంచి 14 నెలల పాటు ఈ చిన్నారి ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు