తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం

  • హార్వీ డే
  • బీబీసీ కోసం

యుక్త వయసు వచ్చిన ఆడపిల్లల్లో తొలిసారి రుతుస్రావం జరిగితే ఆమె పెద్దమనిషి అయిందని తెలుగు సంస్కృతిలో దాన్ని ఓ వేడుకగా చేసుకుంటారు.

కానీ, పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి భిన్నం. తొలిసారి నెలసరి ప్రారంభమైందని తెలిస్తే అక్కడి అమ్మాయిలు తీవ్రమైన భయాందోళనకు గురవుతుంటారు. కానీ, ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితి మారుతోంది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 1

పోస్ట్ of Instagram ముగిసింది, 1

ఇంతకీ రజస్వల కావడం అంటే ఏమిటి?

హర్మోన్లు వ్యాప్తి చెందడం వల్ల మీ శరీరంలో కొత్త మార్పులు వస్తాయి. అంటే మీరు ఓ బిడ్డకు జన్మనిచ్చే సామర్థ్యం పొందారని అర్థం.

అయితే, బ్రిటన్‌లోని చాలా మంది బాలికలు రజస్వల అయ్యామని తెలియగానే ఆందోళన చెందుతున్నారని ఇటీవల వెలువడిన అధ్యయనంలో తేలింది.

నెలసరి ప్రారంభంకాగానే వారు దానిపై సౌకర్యవంతంగా చర్చించలేకపోతున్నారట. ప్రతి 10 మందిలో ఒకరు తాము శానిటరీ ప్యాడ్లను కూడా కొనే ఆర్థికస్థితి లేదని చెబుతున్నారు.

బ్రిటన్‌లోని మూడున్నర లక్షల మంది బాలికలు పీరియడ్స్ సమయంలో స్కూల్‌కు వెళ్లలేకపోతున్నారు. పనిచేసే మహిళలు పీరియడ్స్ సమయంలో ఆఫీసుకు సెలవు పెడుతున్నారు.

అయితే, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఓ కొత్త ట్రెండ్ బ్రిటన్‌లో మొదలైంది.

ఫ్రీ బ్లీడ్ నుంచి పీరియడ్ పార్టీ వరకు

భారత్‌లోని తెలుగు, తమిళ ప్రాంతాల్లో అలాగే శ్రీలంకలో బాలికలు రజస్వల అయితే దాన్ని వేడుకగా చేసుకుంటారు. సమాజానికి ఈ విషయం చేరేలా చేస్తారు. ఇప్పుడు బ్రిటన్‌‌లో కూడా వారి సంస్కృతికి తగ్గట్టుగా ఇలాంటి కార్యక్రమాలను వేడుకగా చేసుకుంటున్నారు.

నెలసరి సమయంలో మహిళలు వారికి అనువైన సమయంలో ఆఫీసులు పనిచేసేలా 2016లో బ్రిస్టల్ కంపెనీ పీరియడ్ పాలసీని తీసుకొచ్చింది.

పీరియడ్‌కు సంబంధించిన అపోహలపై చైతన్యం తెచ్చేందుకు ఇటీవల 'ఫ్రీ బ్లీడ్' పేరుతో ఒక ఉద్యమం వచ్చింది. నెలసరి వచ్చిన మహిళలు శానిటరీ ప్యాడ్‌లు వాడకుండా మారథాన్ రన్నింగ్‌లో పాల్గొనే కార్యక్రమమే 'ఫ్రీ బ్లీడ్' ఉద్యమం.

ఇప్పుడు పీరియడ్ పార్టీల పేరుతో ఓ కొత్త కార్యక్రమం వైరల్‌గా మారుతోంది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 3
View this post on Instagram

Great party, thanks.

A post shared by Matilda🎀 (@mati_patty) on

పోస్ట్ of Instagram ముగిసింది, 3

ఇంతకీ పీరియడ్ పార్టీ అంటే ఏమిటి?

ఇంగ్లాండ్‌లో చాలా కాలం నుంచి ఈ పీరియడ్ పార్టీల ట్రెండ్ నడుస్తోంది. అయితే, గత ఏడాది ఆగస్టు నుంచే ఇది వైరల్‌గా మారింది.

ఒక అమెరికా టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాస్య నటుడు బెర్ట్ క్రైషర్ మాట్లాడుతూ, ''నా కూతురు పీరియడ్ పార్టీ ఇచ్చింది, ఆమె ఫ్రెండ్స్ అందరూ పీరియడ్ పార్టీ ఇస్తున్నారని చెప్పింది'' అని ఆ షోలో పేర్కొన్నారు. ఇది నా జీవితంలో గొప్ప సమయం అని కూడా అన్నారు.

''నా బిడ్డ ఇచ్చిన పార్టీలో బీట్‌రూట్, దానిమ్మ జ్యూస్‌లు, ఎర్రటి సాస్‌తో ఇచ్చిన పాస్తా తిన్నా. అద్భుతంగా ఉన్నాయి'' అని ఆయన తెలిపారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 1

పోస్ట్ of Twitter ముగిసింది, 1

ఇంతకీ పీరియడ్ పార్టీలో ఏం చేస్తారు?

నెలసరిని ప్రతిబింబించేలా ఈ పార్టీలో అన్ని ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను అతిథులకు అందిస్తారు. రెడ్ కలర్ కేక్‌ను సూచికగా పెడుతారు.

2017లో జాక్సన్‌విల్లేకు చెందిన బ్రూక్ లీ (12) తన పీరియడ్ పార్టీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 2

పోస్ట్ of Twitter ముగిసింది, 2

అప్పటి నుంచి చాలా మంది మహిళలు తమ పీరియడ్ పార్టీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

మరికొంత మంది తమ బిడ్డలు, స్నేహితులు, బంధువుల పీరియడ్ పార్టీలను కూడా షేర్ చేస్తున్నారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 3

పోస్ట్ of Twitter ముగిసింది, 3

అయితే, ఇంకొంత మంది పీరియడ్స్ అంటే ఇంకా ఆందోళన చెందుతున్నారు. పీరియడ్స్ పార్టీ అంటే నామోషీగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)