'భారత్ దాడులు చేస్తే పాకిస్తాన్ ఏమాత్రం ఆలోచించకుండా జవాబు చెబుతుంది' -ఇమ్రాన్ ఖాన్.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్
ఫిబ్రవరి 14న భారత పాలిత కశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు మృతి చెందిన తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ మొదటిసారి దీనిపై స్పందించారు.
ఈ దాడికి పాకిస్తానే కారణం అని భారత్ నేరుగా ఆరోపించింది.
ఈ దాడికి బాధ్యులం మేమేనని పాకిస్తాన్లో ఉన్న జైషే మహమ్మద్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది.
దీనిపై మాట్లాడిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ "మొదట మీరు ఏ ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. సౌదీ ప్రిన్స్ పాక్ పర్యటన మాకు చాలా కీలకం. అలాంటి సమయంలో మేం ఇలా చేయిస్తామా? పాకిస్తాన్ స్థిరత్వం వైపు అడుగులు వేస్తున్న ఈ దశలో మేం అలా ఎందుకు చేస్తాం" అన్నారు.
"పాకిస్తాన్‌కు దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది. ప్రతిసారీ మీరు అలా చేయాలనుకుంటే మీరు మాటిమాటికీ అదే చేస్తుంటారు. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా, ఇది కొత్త పాకిస్తాన్. తీవ్రవాదంతో పాకిస్తాన్ స్వయంగా బాధపడుతోంది" అని ఇమ్రాన్ అన్నారు.
ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశంలో చర్చలకు భారత్‌ను స్వాగతించారు. "వచ్చి విచారణ చేసుకోవచ్చని నేను మీకు ఆఫర్ చేస్తున్నా. ఎవరైనా పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటుంటే... వారిని మా శత్రువుగానే భావిస్తాం" అన్నారు.
"తీవ్రవాద సమస్య అంతటా ఉంది. ఈ తీవ్రవాదం వల్ల మాకు వంద బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. భారత్‌లో ఒక కొత్త ఆలోచన రావాలి. కశ్మీరీలలో మృత్యుభయం లేకుండా పోయిందంటే దానికి కారణం ఏమయ్యుంటుంది" అని పాక్ ప్రధాని న్నారు.
"సమస్యలకు పరిష్కారం చర్చలతోనే దొరుకుతుంది. భారత్‌కు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? భారత మీడియాలో, రాజకీయాల్లో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని, దాడులు చేయాలని చర్చ జరుగుతోందని విన్నాం. పాకిస్తాన్‌పై దాడి చేస్తే, పాకిస్తాన్ ఆలోచిస్తుందా, ఆలోచించదు.. పాకిస్తాన్ సమాధానం ఇస్తుంది" అన్నారు.
"కానీ ఆ పరిస్థితులు ఎక్కడకు దారితీస్తాయి. యుద్ధం ప్రారంభించడం సులభమే, కానీ, దానిని ముగించడం ఎవరి చేతుల్లోనూ ఉండదని మనందరికీ తెలుసు. ఇదంతా ఎటు దారితీస్తుందో ఆ అల్లాకే తెలియాలి. అన్నారు ఇమ్రాన్
"మేం వివేకంతో వ్యవహరిస్తాం, అఫ్గానిస్తాన్‌తో వ్యవహరించినట్లే, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాం. అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పుల్వామా దాడి: కశ్మీర్ యువత మిలిటెన్సీలో ఎందుకు చేరుతోంది
- ఆ ప్రశ్నలు అమ్మాయిలకే ఎందుకు?
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- సెక్స్‌కు గుండెపోటుకు సంబంధముందా?
- పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందంట!!
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- '18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ అత్యాచారమే'
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)