టినిటస్... ఇదో వింత సమస్య

  • 21 ఫిబ్రవరి 2019
నటాలీ లూ - టినిటస్ సమస్య

టినిటస్... ఇదో వింత సమస్య. ఇది వచ్చిన వారికి చెవుల్లో నిరంతరాయంగా 'గుయ్' మనే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది.

టినిటస్ అనే సమస్య వస్తే మన చెవుల్లో ఇలానే ఉంటుంది. దీనికి ఓ సమయమంటూ ఉండదు.

ఒక్కోసారి రోజంతా ఉండవచ్చు. ఒక్కోసారి కాసేపటికి తగ్గిపోవచ్చు. కానీ తగ్గే అవకాశాలైతే చాలా తక్కువ.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionటినిటస్ అంటే ఏంటి?

టినిటస్‌కు ప్రధాన కారణం ఒత్తిడి.

దేని గురించైనా అతిగా ఆలోచించినా, ఎక్కువ ఒత్తిడికి గురైనా... ఈ ఒత్తిడితోపాటు, సరిగ్గా నిద్రలేకపోయినా... టినిటస్‌ ఉన్నవారి చెవులు శబ్దంతో మోతెక్కిపోతాయి.

యూకే పాడ్‌కాస్టర్ నటాలీ లూ రోజంతా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు.

"సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు నా చెవులు మోతెక్కిపోతాయి. టినిటస్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో నేనెప్పుడు మాట్లాడినా.. "మీకు టినిటస్ ఉందా?" అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. "నాకూ ఉంది" అంటూ మాటలు మొదలుపెడతారు. మా బాధలను, అనుభవాలను పంచుకుంటాం. అప్పుడే నాకర్థమైంది... దీని గురించి చర్చించడం చాలా అవసరమని" అంటారు నటాలీ.

టినిటస్ వయసులో పెద్దవాళ్లకే వస్తుందనే ఓ అపోహ ఉంది. కానీ, దీనికి వయసుతో సంబంధం లేదు. టినిటస్ ఏ వయసు వాళ్లనైనా ఇబ్బంది పెట్టొచ్చు.

టినిటస్‌కు సరైన పరిష్కారం లేదు. కేవలం జీవిత శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే కొంతవరకూ ఉపశమనం ఉంటుంది.

ఎప్పుడూ ఆశను వదులుకోకూడదు. ఒత్తిడికి గురవ్వకూడదు. మన పనులు మనం చేసుకుంటూనే, వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి.

ఈ మూడూ పాటిస్తే, టినిటస్ ప్రభావాన్ని కొంతవరకూ తగ్గించవచ్చు అని బ్రిటిష్ టినిటస్ అసోసియేషన్ చెబుతోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరిశిక్ష: దిల్లీ కోర్టు

ఒక 'బలవంతపు పెళ్లి' వేల మందిని కాపాడింది

శ్రీనివాస్ గౌడ: ‘ట్రయల్ రన్‌లో పాల్గొనను.. పరుగు పందేలపై ఆసక్తి లేదు’

మహిళలు కూడా ఆర్మీలో కమాండింగ్ రోల్స్‌, శాశ్వత కమిషన్‌కు అర్హులే: సుప్రీంకోర్టు

హాంకాంగ్‌లో టాయిలెట్‌ రోల్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. సూపర్ మార్కెట్ల వద్ద భారీగా క్యూలు కడుతున్న జనం

ఉమెన్స్ లీగ్: భారత మహిళల ఫుట్‌బాల్‌లో ఎలాంటి మార్పులొస్తున్నాయి

జపాన్‌ తీరంలో ఆగిన డైమండ్ ప్రిన్సెస్ నౌక నుంచి ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి బయల్దేరిన అమెరికన్లు

"ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు.. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా" - ఓ పోలీసు అధికారి