శాంసంగ్ ఫోల్డ్: మడతపెట్టగలిగే ఈ ఫోన్ ధరెంతో తెలుసా

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్

ఫొటో సోర్స్, Samsung

ఫొటో క్యాప్షన్,

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్

శాంసంగ్ సంస్థ 'గెలాక్సీ ఫోల్డ్' పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేసింది.

టెక్నాలజీ ప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ ఫోన్‌ను ఎట్టకేలకు విడుదల చేసిన శాంసంగ్ దీంతో పాటు గెలాక్సీ ఎస్10 5జీ ఫోన్.. మూడు ఎస్ 10 మోడళ్లనూ లాంచ్ చేసింది. గెలాక్సీ ఫోల్డ్ అమ్మకాలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి.

4జీ వెర్షన్ ధర 1,980 డాలర్లు(సుమారు రూ.1.40 లక్షలు ఉండొచ్చని అంచనా). 5జీ వెర్షన్ కూడా విడుదల చేస్తామని శాంసంగ్ చెబుతోంది.. దాని ధర ఎక్కువ ఉండొచ్చు.

ఫొటో సోర్స్, Samsung

గెలాక్సీ ఫోల్డ్ ప్రత్యేకతలు

ఈ ఫోన్‌ను పూర్తిగా తెరిచినప్పుడు టాబ్లెట్ తరహాలో 7.3(18.5 సెంటీమీటర్ల) అంగుళాల స్క్రీన్ ఉంటుంది. సాధారణ స్థితిలో 4.6 అంగుళాల స్క్రీన్ కనిపిస్తుంది.

ఒకేసారి మూడు యాప్‌లను వినియోగించుకునే మల్టీ టాస్కింగ్ సౌలభ్యం ఉంది.

ఇంతకుముందు వచ్చిన ఫోల్డబుల్ ఫోన్ 'రోయోల్స్ ఫ్లెక్స్‌పాయ్'తో పోల్చితే ఈ డివైస్‌లో ఒక మోడ్ నుంచి మరో మోడ్‌లోకి సులభంగా మారొచ్చు.

ఈ ఫోన్ మరో ప్రత్యేకత 6 కెమేరాలను కలిగి ఉండడం. వీటిలో మూడు కెమేరాలు ఫోన్ వెనుక వైపు ఉంటాయి. ఒకటి ఫ్రంట్ కెమేరా. ఇంకో రెండు కెమేరాలు ఫోన్లో ఉంటాయి.

ఫొటో సోర్స్, Samsung

ఫొటో క్యాప్షన్,

శాంసంగ్ ఎస్ 10 సిరీస్ ఫోన్లు

గెలాక్సీ ఎస్10 సిరీస్

గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో ఎస్ 10, ఎస్ 10+ మోడళ్లను శాంసంగ్ విడుదల చేసింది. వీటి ధరలు 799 డాలర్లు, 899 డాలర్లుగా ప్రకటించింది ఆ సంస్థ.

ఇవి మార్చి 8 నుంచి అందుబాటులోకి వస్తాయి.

ఎస్10ఈ పేరుతో విడుదల చేసిన మరో మోడల్ ధర 669 డాలర్లు. ఈ మోడల్ విక్రయాలు మొదలవుతున్నాయి.

ఫొటో సోర్స్, Samsung

వేసవిలో ఎస్10 5జీ

ఎస్10 సిరీస్‌లోనే 5జీ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. ఇది ఈ వేసవిలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. దీని ధర ఎంతుంటుందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు.

శాంసంగ్ కనుక 5జీ ఫోన్ విడుదల చేస్తే మార్కెట్లో యాపిల్‌పై పైచేయి సాధించడానికి అదో అవకాశంగా మారుతుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)