అఫ్ఘానిస్తాన్ వర్సెస్ ఐర్లండ్: టీ20లో అఫ్ఘాన్ వరల్డ్ రికార్డ్

  • 23 ఫిబ్రవరి 2019
అఫ్ఘాన్ క్రికెట్ Image copyright AFghanistan cricket/fb

టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసి అఫ్ఘానిస్థాన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆ జట్టు నిర్ణీత 20 ఒవర్లలో 278 పరుగులు సాధించి చరిత్ర సృష్టించింది.

ఆ జట్టు బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా జాజి సెంచరీతో రాణించారు.

62 బంతుల్లో 162 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచారు. జాజి స్కోర్‌లో అత్యధికంగా సిక్స్‌ల నుంచే వచ్చాయి.

16 సిక్స్‌లు, 11 ఫోర్లతో స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు. అతనికి తోడుగా వచ్చిన ఉస్మాన్ ఘణి కూడా 73 పరుగులతో రాణించాడు.

వీరిద్దరి భాగస్వామ్యంతో అఫ్ఘాన్ జట్టు 278 పరుగులు సాధించింది. ఇదే క్రమంలో ఈ జంట టీ20లో అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

Image copyright AFghanistan cricket/fb

టీ20లో ఒక జట్టు అత్యధికంగా సాధించిన స్కోరు ఇదే.

2016లో ఆస్ట్రేలియా 263 పరుగులు సాధించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్‌గా ఉండేది. ఈ రికార్డ్‌ను ఐర్లండ్ మ్యాచ్‌లో అఫ్ఘాన్ బ్రేక్ చేసింది.

గతంలో అత్యధిక భాగస్వామ్యం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు అరోన్ ఫించ్, డార్సీ( 223 పరుగులు) పేరటి ఉండేది. ఈ రికార్డునూ హజ్రతుల్లా, ఉస్మాన్ జంట బద్దలు కొట్టింది.

అంతర్జాతీయ టీ20లో అత్యధిక స్కోర్లు ఇవే:

మరిన్ని వివరాలకు పేజీని రిఫ్రెష్ చేయండి

ఇవి కూడా చదవండి

'సర్కార్'లో చెప్తున్న సెక్షన్ 49(పి)తో దొంగ ఓటును గెలవడం సాధ్యమేనా?

నెహ్రూ కాలర్ పట్టుకుని నిలదీసిన మహిళ

జాతీయగీతానికి మదనపల్లెకూ ఉన్న సంబంధమిది

క్విట్ ఇండియా ఉద్యమం: ఆ ఊళ్లో ఇంటి పేరును ఆజాద్ అని మార్చుకున్నారు

90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్‌, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...

కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య

ట్రంప్‌కు 70 లక్షల మంది స్వాగతం పలకడం సాధ్యమేనా...

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

విశాఖ ఏజెన్సీ: తమ ఊరికి సొంతంగా రోడ్డు నిర్మించుకున్న ఈ గిరిజనులు ఏమంటున్నారో వింటారా...

ఛత్తీస్‌గఢ్ గిరిజనులపై బంగ్లాదేశ్ శరణార్థులు నిజంగానే ఆధిపత్యం చలాయిస్తున్నారా?

200 ఏళ్ల నాటి ఈస్టిండియా కంపెనీ పెయింటింగ్స్‌.. భారత్‌కు నచ్చలేదు, బ్రిటన్‌ ఇబ్బంది పడింది ఎందుకు

‘నగ్నంగా గుంపులుగా నిలబెట్టి, ‘ఫింగర్ టెస్ట్’లు చేశారు’: ఫిట్‌నెస్ పరీక్షల నిర్వహణ తీరుపై మహిళా ఉద్యోగుల అభ్యంతరం