India vs Australia T20 : విశాఖపట్నంలో గెలుపు ఎవరిది?

  • 24 ఫిబ్రవరి 2019
india Image copyright Getty Images

ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు భారత్.. ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభం కానుంది.

మొదటగా ఈ ఇరు దేశాల మధ్య రెండు టీ 20 మ్యాచ్‌లు తర్వాత అయిదు వన్డేలు జరుగుతాయి.

మొదటి టీ 20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7.00 గంటలకు మొదలుకానుంది.

విశాఖ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ? భారత్‌కా లేక ఆస్ట్రేలియాకా? ఎవరి బలాబలాలేంటో చూద్దాం.

మొదట గ్రౌండ్ విషయానికి వస్తే ఇది కాస్త చిన్నది.

ఇక్కడ భారత్‌కు చాలా మెరుగైన రికార్డు ఉంది.

ఇక్కడ 10 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్ 8 మ్యాచ్‌లు గెలిచింది. ఒకటి టై కాగా.. ఒకదాంట్లో భారత్‌పై వెస్టిండీస్ నెగ్గింది.

ఇక కెప్టెన్ కోహ్లీకి, ధోనీకి కూడా మంచి రికార్డే ఉందని క్రికెట్ విశ్లేషకులు సీహెచ్ వెంకటేశ్ పేర్కొన్నారు. కోహ్లీ వైజాగ్‌లో ఎన్నడూ విఫలం కాలేదని.. మూడు సెంచురీలు, రెండు ఫిఫ్టీలు సాధించారని వివరించారు. అలాగే ధోనీకి ఇక్కడ మంచి రికార్డే ఉందన్నారు.

ధోనీ తన అయిదో వన్డేలో ఇక్కడే 148 పరుగులు చేశారని.. అక్కడి నుంచి అతను రాణించాడని విశ్లేషించారు.

Image copyright Getty Images

ఇక ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే.. టీ20 మ్యాచుల్లో ఎవరు గెలుస్తారన్నది కచ్చితంగా చెప్పడం చాలా కష్టం.. కానీ ఈ రోజు మ్యాచ్‌లో భారత్‌కే మెరుగైన అవకాశాలున్నాయని వెంకటేశ్ చెప్పారు.

''భారత్‌లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో భారత్ ఓడిపోలేదు. మొత్తం మూడు సిరీస్‌లు జరిగితే రెండు భారత్ గెలిచింది. ఒకటి డ్రా అయింది. ఇక కోహ్లీ కెప్టెన్‌గా ఒక్క టీ20 కూడా ఓడిపోలేదు'' అని వివరించారు.

ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఆ దేశాన్ని అక్కడే భారత్ వన్డే.. టెస్టుల్లో ఓడించిందని గుర్తు చేశారు.

ఇక భారత్‌లో జరుగుతున్న తాజా మ్యాచ్‌లో భారత్‌కు చాలా అనుకూలతలున్నాయని వెంకటేశ్ వివరించారు. అవేంటంటే..

Image copyright Getty Images
  • స్పిన్ బౌలింగ్
  • చాహల్ ఫామ్‌లో ఉండటం
  • పూర్తిస్తాయి టీం
  • జట్టులో కోహ్లీ, బుమ్రా
  • స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్

ఆస్ట్రేలియాకి ఉన్న అనుకూలతల గురించి వెంకటేశ్ మాట్లాడుతూ.. ఆ జట్టుకు బౌలింగ్ చాలా బలంగా ఉందన్నారు.

ఇటీవల బిగ్ బాష్ లీగ్‌లో మంచి ఫామ్‌ సంపాదించిన ఆటగాళ్లు జట్టులో ఉండటం ఆస్ర్టేలియాకు కలిసొచ్చే అంశమని వివరించారు.

ఆల్‌రౌండర్ మార్కర్స్ స్టాయిన్స్ భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగలరని కోహ్లీ కూడా ప్రస్తావిచారని తెలిపారు. అలాగే బౌలర్ పాట్ కమిన్స్ కూడా మంచి ఫాంలో ఉన్నారని తెలిపారు.

Image copyright Getty Images

అలాగే ఈరోజు మ్యాచ్‌లో భారత జట్టులో హార్దిక్ పాండ్యా స్థానంలో ఆల్‌రౌండర్ కృణాల్ పాండ్యాను తీసుకోవచ్చని వెంకటేశ్ చెప్పారు. హార్దిక్ లోటును కృణాల్ తీర్చే వీలుందని వివరించారు.

ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌తో భారత్ స్ట్రాంగ్‌గా ఉండగా.. ఆస్ర్టేలియా కాస్త బలహీనంగా ఉందని వెంకటేశ్ చెప్పారు.

పైగా స్పిన్నర్స్‌ని ఎదుర్కోవడం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్‌కి కష్టం కనుక మ్యాచ్ గెలిచే అవకాశాలు భారత్‌కే మెరుగ్గా ఉన్నాయని ఆయన విశ్లేషించారు.

అయితే టీ 20లో ఏమైనా జరగొచ్చని ముందస్తు అంచనాలు కష్టమనీ చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరిశిక్ష: దిల్లీ కోర్టు

ఒక 'బలవంతపు పెళ్లి' వేల మందిని కాపాడింది

శ్రీనివాస్ గౌడ: ‘ట్రయల్ రన్‌లో పాల్గొనను.. పరుగు పందేలపై ఆసక్తి లేదు’

మహిళలు కూడా ఆర్మీలో కమాండింగ్ రోల్స్‌, శాశ్వత కమిషన్‌కు అర్హులే: సుప్రీంకోర్టు

హాంకాంగ్‌లో టాయిలెట్‌ రోల్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. సూపర్ మార్కెట్ల వద్ద భారీగా క్యూలు కడుతున్న జనం

ఉమెన్స్ లీగ్: భారత మహిళల ఫుట్‌బాల్‌లో ఎలాంటి మార్పులొస్తున్నాయి

జపాన్‌ తీరంలో ఆగిన డైమండ్ ప్రిన్సెస్ నౌక నుంచి ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి బయల్దేరిన అమెరికన్లు

"ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు.. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా" - ఓ పోలీసు అధికారి