ఆస్కార్ 2019: ఉత్తమ నటీనటులు - ఒలీవియా కోల్మన్, రమీ మాలిక్... ఉత్తమ చిత్రం గ్రీన్ బుక్

  • 25 ఫిబ్రవరి 2019
ఆస్కార్ 2019 Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆస్కార్ 2019 విజేతలు: ఉత్తమ నటుడు రమీ మాలెక్, ఉత్తమ నటి ఓలీవియా కోల్మన్, రెజీనా కింగ్, మహెర్షాలా అలీ

ఆస్కార్ అవార్డుల సంబరం ఆదివారం లాస్ ఏంజెలెస్ నగరంలో అట్టహాసంగా జరిగింది. బ్రిటిష్ నటి ఓలీవియా కోల్మన్ ఉత్తమ నటి అవార్డు గెల్చుకున్నారు. అందర్నీ విస్మయానికి గురి చేస్తూ గ్రీన్ బుక్ చిత్రం బెస్ట్ ఫిల్మ్ అవార్డు కైవసం చేసుకుంది.

ది ఫేవరెట్ చిత్రంలో అభినయానికి ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్న కోల్మన్ భావోద్వేగంతో కూడిన ప్రసంగంతో అందరినీ అలరించారు

గ్రీన్ బుక్ చిత్రానికి ఉత్తమ చిత్రం సహా మొత్తం మూడు అవార్డులు లభించాయి. ఈసారి అవార్డు రోమా చిత్రానికే అనే అంచనాలను ఆ చిత్రం తలకిందులు చేసింది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఉత్తమ చిత్రం: గ్రీన్ బుక్

ఈసారి అవార్డుల్లో అత్యధికంగా బోహిమియన్ రాప్సొడి చిత్రం నాలుగు అవార్జులు గెల్చుకుంది. గ్రీన్ బుక్, రోమా, బ్లాక్ పాంథర్ చిత్రాలు మూడేసి అవార్డులు సొంతం చేసుకున్నాయి.

2018 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు సంబంధించి ఉత్తమ చిత్రం, నటీనటులతో పాటు వివిధ సాంకేతిక విభఆగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు.

ఉత్తమ నటి: ఒలీవియా కోల్మన్ (ది ఫేవరెట్)

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తమ నటి: ఒలీవియా కోల్మన్ (ద ఫేవరేట్)

'ఇది నిజంగా తీవ్రమైన ఒత్తిడితో కూడిన ఆనందం కలిగిన సందర్భం. నాకు ఆస్కార్ వచ్చింది" అని కోల్మన్ కంటతడి పెడుతూ అన్నారు. ఆమె 2009లో కేట్ విన్‌స్లెట్ తరువాత ఆస్కార్ అందుకున్న రెండో బ్రిటిష్ నటి.

ఉత్తమ నటుడు: రమీ మాలెక్ (బొహిమినియన్ రాప్సొడి)

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తమ నటుడు: రమీ మాలిక్ (బొహీమియన్ రాప్సొడీ)

అత్యధికంగా నాలుగు ఆస్కార్‌లు గెల్చుకున్న 'బొహిమియన్ రాప్సొడి' చిత్రంలో క్వీన్ బ్యాండ్ లీడ్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యురీ పాత్ర పోషించిన రమీ మాలెక్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

"తనదైన ఉనికిని, గుర్తింపును చాటుకోవాలని తపించిన ఒక గాయకుడి కథ, ఒక గే కథ ఇది. అచ్చంగా తన కోసమే జీవించిన ఓ కాందిశీకుడి కథ. ఆయన జీవితాన్ని నేను వేడుక చేసుకున్నాను. ఈ వేడుకకు పురస్కారం లభించడం, ఇలాంటి కథల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారనడానికి నిదర్శనం" అని రమీ మాలెక్ అన్నారు.

మహెర్షలా అలీ, రెజీనా కింగ్

Image copyright AFP/reuters
చిత్రం శీర్షిక ఉత్తమ సహాయ నటీనటులుగా ఆస్కార్ అందుకున్న మహెర్షాలా అలీ, రెజీనా కింగ్

మహెర్షలా అలీకి ఇది గత మూడేళ్ళలో సహాయ నటుడిగా రెండో అవార్డు. 2017లో మూన్‌లైట్ చిత్రానికి అవార్డు అందుకున్న అలీ 'గ్రీన్ బుక్' చిత్రంలో జాజ్ పియానిస్ట్ డాన్ షిర్లే పాత్ర పోషించి మరోసారి అదే అవార్డు అందుకున్నారు.

ఇక, 'బీల్ స్ట్రీట్ కుడ్ టాక్' చిత్రానికి రెజీనా కింగ్ ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలిసారే ఆమెను అవార్డు వరించడం విశేషం.

ఆస్కార్ 2019 విజేతలు వీరే...

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తమ దర్శకుడు: అల్ఫాన్సో కువారాన్ (రోమా)
Image copyright Reuters
చిత్రం శీర్షిక బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: బ్లాక్‌క్లాన్స్‌మాన్ - చార్లీ వాచెల్, డేవిడ్ రాబినోవిట్జ్, కెవిన్ విల్మాట్, స్పైక్ లీ

ఉత్తమ యానిమేషన్ చిత్రం: స్పైడర్ మ్యాన్: ఇంటూ ద స్పైడర్-వెర్స్

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తమ పాట: షాలో (ఎ స్టార్ ఈజ్ బోర్న్) - లేడీ గాగా, మార్క్ రాన్సన్, ఆంథొనీ రాసొమాండో, ఆండ్రూ వ్యాట్
Image copyright AFP
చిత్రం శీర్షిక బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: బ్లాక్ పాంథర్ - హన్నా బీచ్లర్, జే హార్ట్
Image copyright Getty Images
చిత్రం శీర్షిక బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్ - రూత్ ఇ కార్టర్
Image copyright Getty Images
చిత్రం శీర్షిక బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్: వైస్ - గ్రెగ్ కానన్, కేట్ బిస్కోయ్, పాట్రీసియా డిహనీ
Image copyright Reuters
చిత్రం శీర్షిక ఉత్తమ నేపథ్య సంగీతం: బ్లాక్ పాంథర్ - లుడ్విగ్ గొరాన్సన్
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తమ లఘు చిత్రం: పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్

ఉత్తమ విదేశీ భాషా చిత్రం: రోమా - మెక్సికో

ఉత్తమ లఘు యానిమేషన్ చిత్రం: బావో

ఇతర విభాగాల్లో అవార్డుల విజేతలు

ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: ఫ్రీ సోలో

బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్ ప్లే: గ్రీన్ బుక్ - నిక్ వల్లెలోంగా, బ్రియాన్ క్యూరీ, పీటర్ ఫారెలీ

ఉత్తమ ఛాయాగ్రహణం: రోమా - అల్ఫాన్సో కువారాన్

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ఫస్ట్ మ్యాన్ - పాల్ లాంబార్ట్, ఇయాన్ హంటర్, ట్రిస్టన్ మైల్స్, జె.డి. ష్వామ్

బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బొహీమియన్ రాప్సొడీ - జాన్ వార్‌హర్స్ట్, నీనా హర్ట్‌స్టోన్

బెస్ట్ సౌండ్ మిక్సింగ్: బొహీమియన్ రాప్సొడీ - పాల్ మాసే, టిమ్ కవాగిన్, జాన్ కాసలి

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: బొహీమియన్ రాప్సొడీ - జాన్ ఒటామన్

బెస్ట్ లఘు లైవ్ యాక్షన్: స్కిన్

ఈసారి ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ప్రధాన వ్యాఖ్యాత (మెయిన్ హోస్ట్)గా ఎవరూ వ్యవహరించలేదు. టీనా ఫే, మాయా రుడాల్ఫ్, అమీ పోహ్లర్‌లు కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి అవార్డు బహూకరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆస్కార్ కార్యక్రమాన్ని జూలియా రాబర్ట్స్ ముగించారు

వివిధ విభాగాల్లో విజేతలకు ప్రముఖ నటీనటులు అవార్డులను అందజేశారు.

నామినీలందరికీ కృతజ్ఞతలు చెప్తూ ప్రఖ్యాత నటి జూలియా రాబర్ట్స్ అవార్డుల ఉత్సవాన్ని ముగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్: ‘మీ పౌరసత్వాన్ని నిరూపించుకోండి’ - మొహమ్మద్ సత్తార్ ఖాన్‌కు యూఐడీఏఐ నోటీసు

ఆర్మీలో మహిళాధికారులు శాశ్వత కమిషన్‌కు అర్హులన్న సుప్రీం కోర్టు తీర్పుతో జరిగేదేంటి

టీనేజ్ అమ్మాయిల ఫొటోలు పంపించి సైనికుల ఫోన్లు హ్యాక్ చేసిన మిలిటెంట్లు

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

ఘోస్ట్ హ్యూమన్స్.. అంతు చిక్కని మానవ జాతి ఆధారాలు కనుగొన్న పరిశోధకులు

ఐఫోన్లకు కరోనా వైరస్ దెబ్బ.. ఉత్పత్తి, అమ్మకాలు, ఆదాయంపై ప్రభావం పడిందన్న ఆపిల్

పంటకు నష్టం చేసిన కలుపుమందు.. బేయర్ సంస్థకు రూ. 1,890 కోట్ల జరిమానా విధించిన కోర్టు

కరోనావైరస్: ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది