ఫేస్ బ్లైండ్‌నెస్: ఇది మతిమరుపు కాదు.. కానీ మనుషులను గుర్తుపట్టరు

ఫేస్ బ్లైండ్‌నెస్: ఇది మతిమరుపు కాదు.. కానీ మనుషులను గుర్తుపట్టరు

బ్లైండ్‌నెస్ అంటే చూపు లేకపోవడం. మరి... ఫేస్ బ్లైండ్‌నెస్ అంటే ఏమిటో తెలుసా? ఇదో వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు అందరిలాగానే అన్నీ చూడగలరు. కానీ, మనుషుల ముఖాలను మాత్రం గుర్తుపట్టలేరు. ఆఖరుకు ఇంట్లో వాళ్లను, ప్రాణ స్నేహితులను కూడా గుర్తించలేరు.

వైద్య పరిభాషలో దీన్ని 'ప్రోసో-పాగ్-నోసియా' అంటారు. ఈ సమస్య ఉన్న వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దీని గురించి మరింత లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని బ్రిటన్ పరిశోధకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఫేస్ బ్లైండ్‌నెస్‌తో బాధపడుతున్న ఒక బ్రిటీష్ మహిళతో బీబీసీ మాట్లాడింది. మనుషులు ఆమెకు ఎలా కనిపిస్తారో.. ఆమె పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)