మానసిక ఒత్తిడి వల్ల తొందరగా చనిపోతారా?

  • 19 మార్చి 2019
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: మనసు విరిగితే మరణిస్తారా?

మనసు విరిగితే.. నిజంగా చనిపోతారా? డాక్టర్లు నిజమే అంటున్నారు. దీనికి కారణం.. మీ మెదడు. అవును బాధ, భయం, కోపం వంటి భావోద్వేగాలు మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని తాజా అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.

మనసుకు చాలా కష్టం కలిగినప్పుడు మెదడు ఎంతో ఒత్తిడికి గురవుతుందని పరిశోధకులు గుర్తించారు.

మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే అది ఆయుష్షును క్షీణింప చేస్తుందని గతంలో జరిపిన పరిశోధనలు కూడా వెల్లడి చేశాయి.

కొన్నేళ్ళ కిందట లండన్‌లోని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు 68,000 మంది వయోజనులను అధ్యయనం చేశారు. ఒత్తిడి, ఉద్వేగాలు మృత్యువును చేరువ చేస్తాయని ఈ అధ్యయనం వెల్లడి చేసింది.

భావోద్వేగాల ప్రభావం మనిషి మీద ఏ స్థాయిలో ఉంటుంది... అది మనిషిని మరణం దిశగా ఎలా నడిపిస్తాయో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు