వీడియో: రెయిన్‌బో నది అందాలు మీరూ చూడండి
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

రెయిన్‌బో నది అందాలు మీరూ చూడండి

  • 28 మార్చి 2019

ఆఫ్రికా దేశమైన కొలంబియాలో ఉన్న ఈ నదిని 'ఖనిజాల గని' అంటారు. ఈ నది రంగును చూసి పర్యటకులంతా మంత్రముగ్థులు అవుతుంటారు.

ఈ ప్రాంతంలో 'మకరేనియా క్లేవిగెరా' అనే నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి.

వాటి వల్లే ఈ నది రంగు అలా ఉంటుందని స్థానిక టూరిస్టు గైడ్ వాల్తర్ రామోస్ అంటున్నారు.

వివిధ రంగుల్లో కనువిందు చేస్తున్న ఈ నదిని 'రెయిన్‌బో రివర్' అంటారు.

ఈ ప్రాంతానికి లక్షల ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని 'షీల్డ్ ఆఫ్ గయానా'గా అభివర్ణిస్తారు.

ఈ నది రంగు గురించి అనేక వాదనలు ఉన్నాయి. రాళ్లల్లో ఖనిజాలు ఉండటంతో నదికి ఈ రంగు వచ్చిందని కొందరు అంటారు.

ఖనిజాలతో పాటు, రాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల... ఇక్కడ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగలేవని చెబుతారు.

ఈ మొక్కలు ఏడాదికి ఒక సెంటీమీటర్ మాత్రమే పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు