పాకిస్తాన్: ఇద్దరు హిందూ బాలికల కిడ్నాప్, మత మార్పిడి.. పాక్‌లో ఆందోళనలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పాకిస్తాన్: ఇద్దరు హిందూ బాలికల కిడ్నాప్, మత మార్పిడి.. పాక్‌లో ఆందోళనలు

  • 26 మార్చి 2019

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఇద్దరు హిందూ బాలికలను కిడ్నప్ చేసి వారి మతాన్ని కూడా మార్చిన ఉదంతంలో ఆ దేశ మైనారిటీలైన హిందువులు ఆగ్రహంగా ఉన్నారు.

రోడ్లపై ప్రదర్శనలు నిర్వహిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలంటూ పాకిస్తాన్‌లోని హిందువులు డిమాండ్ చేస్తున్నారు.

హోలీకి ఒక రోజు ముందు సింధ్ ప్రాంతంలోని ఘోట్కి జిల్లాలో ఇద్దరు టీనేజీ మైనర్ బాలికలను కొందరు అపహరించారు. ఆ తరువాత వారి మతాన్ని మార్చి పెళ్లి జరిపించి వాళ్ళని కొట్టిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ వీడియోలో నిజమెంత అనేది బీబీసీకి ఇంకా తెలియలేదు.

కానీ ఈ విషయం మీడియాలో వెలుగు చుసిన వెంటనే భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్తాన్ హై కమిషన్ నుంచి వివరణ అడిగారు.

అయితే పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి మాత్రం ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని, మైనారిటీలను హింసించడానికి ఇది మోదీ పాలనలోని భారత్ కాదని విమర్శించారు.

ఈ వ్యాఖ్యల పై సుష్మా స్వరాజ్ ఘాటుగా స్పందించారు. ''నేను రిపోర్ట్ మాత్రమే అడిగాను...దానికే పాకిస్తాన్ మంత్రి కంగారు పడిపోతున్నారు. దీని బట్టి పాకిస్తాన్ చవకబారు ప్రవర్తన అర్థమవుతోంది'' అని సుష్మా అన్నారు.

బీబీసీ కరాచీ ప్రతినిధి రియాజ్ సోహైల్ పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ మైనారిటీ వ్యవహారాల మంత్రి హరి రామ్ కిశోరీలాల్‌తో మాట్లాడారు.

''కొంత మందిని అరెస్ట్ చేశాం. కానీ అందులో కొంత గందరగోళం ఉంది. ఈ అమ్మాయిలు కాన్పూర్ కఠోరా వెళ్లారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. నిఖా చేసిన మౌలానా సహా కొంత మందిని అరెస్ట్ చేసినట్లు మా వద్ద నివేదికలు ఉన్నాయి'' అని ఆయన చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)