స్పేస్ సూట్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు అన్ని డిజైన్లకూ మగవాడే ప్రామాణికం.. ఎందుకిలా?

  • 28 మార్చి 2019
మొబైల్ ఫోన్ రెండు చేతులతో పట్టుకున్న యువతి

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఇద్దరు మహిళా వ్యోమగాములతో స్పేస్ వాక్‌ను నిర్వహించేందుకు ప్రయత్నించింది. అంతరిక్ష కేంద్రంలో ఒక మహిళకు మాత్రమే సరిపోయే స్పేస్ సూట్ ఉండటం, మరొక మహిళకు సరిపోయే స్పేస్ సూట్ లేపకోవడం వల్ల ఈ కార్యక్రమం రద్దయ్యింది. ఇది జరిగుంటే మహిళలు మాత్రమే పాల్గొన్న తొలి అంతరిక్ష నడక ఇదే అయ్యేది.

స్పేస్ సూట్లే కాదు ఏసీ దగ్గర నుంచి కార్ల వరకు చాలా వాటిని మగవారినే ప్రామాణికంగా తీసుకొని డిజైన్ చేస్తారు.

అన్ని రంగాల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionసరిపోయే స్పేస్ సూట్ లేక మహిళా వ్యోమగాముల స్పేస్ వాక్ రద్దు

ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) టెక్నాలజీని పరిశీలిద్దాం.

ఏసీ టెక్నాలజీలోనూ మహిళలపై వివక్ష ఉందనే విమర్శలున్నాయి. ఆఫీసులకు సరైన ఉష్ణోగ్రత ఎంతనేది 1960ల్లో నిర్ణయించారు.

సగటు పురుషుడి జీవక్రియ ఆధారంగా దీనిని నిర్ణయించారు. అయితే ఒకే ఉష్ణోగ్రత వద్ద మగవారికన్నా ఆడవారికి ఎక్కువ చలిగా అనిపిస్తుంది.

స్మార్ట్ ఫోన్ దగ్గరకు వద్దాం. స్మార్ట్ ఫోన్ పరిమాణం పెరుగుతూ వస్తోంది. పురుషుడి మాదిరి ఒక్క చేత్తోనే ఫోన్ పట్టుకోవాలంటే సగటు మహిళకు కష్టమే.

ఎందుకంటే సగటున చూస్తే మగవారి కన్నా ఆడవారి చేతులు చిన్నవిగా ఉంటాయి.

కార్ల సంగతి చూద్దాం.

కారు ప్రమాదంలో పురుషుడితో పోలిస్తే స్త్రీ తీవ్రంగా గాయపడే అవకాశాలు 47 శాతం ఎక్కువగా ఉంటాయి.

కారు ఎంత సురక్షితమనే పరీక్షల్లో పురుషుడి శరీరాన్ని ప్రామాణికంగా తీసుకోవడమే దీనికి కారణం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)