సరిపోయే స్పేస్ సూట్ లేక మహిళా వ్యోమగాముల స్పేస్ వాక్ రద్దు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

సరిపోయే స్పేస్ సూట్ లేక మహిళా వ్యోమగాముల స్పేస్ వాక్ రద్దు

  • 28 మార్చి 2019

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఇద్దరు మహిళా వ్యోమగాములతో స్పేస్ వాక్‌ను నిర్వహించేందుకు ప్రయత్నించింది. అంతరిక్ష కేంద్రంలో ఒక మహిళకు మాత్రమే సరిపోయే స్పేస్ సూట్ ఉండటం, మరొకరికి సరిపోయేది లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం రద్దయ్యింది. ఇది జరిగుంటే మహిళలు మాత్రమే పాల్గొన్న తొలి అంతరిక్ష నడక ఇదే అయ్యేది.

స్పేస్ సూట్లే కాదు ఏసీ దగ్గర నుంచి కార్ల వరకు చాలా వాటిని మగవారినే ప్రామాణికంగా తీసుకొని డిజైన్ చేస్తారు. అన్ని రంగాల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) టెక్నాలజీని పరిశీలిద్దాం.

ఏసీ టెక్నాలజీలోనూ మహిళలపై వివక్ష ఉందనే విమర్శలున్నాయి. ఆఫీసులకు సరైన ఉష్ణోగ్రత ఎంతనేది 1960ల్లో నిర్ణయించారు. సగటు పురుషుడి జీవక్రియ ఆధారంగా దీనిని నిర్ణయించారు. అయితే ఒకే ఉష్ణోగ్రత వద్ద మగవారికన్నా ఆడవారికి ఎక్కువ చలిగా అనిపిస్తుంది.

స్మార్ట్ ఫోన్ దగ్గరకు వద్దాం. స్మార్ట్ ఫోన్ పరిమాణం పెరుగుతూ వస్తోంది. పురుషుడి మాదిరి ఒక్క చేత్తోనే ఫోన్ పట్టుకోవాలంటే సగటు మహిళకు కష్టమే. ఎందుకంటే సగటున చూస్తే మగవారి కన్నా ఆడవారి చేతులు చిన్నవిగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)