అత్యంత భారీ ఎయిర్‌పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే

చైనాలో భారీ విమానాశ్రయం

చైనా రాజధాని బీజింగ్‌లో మరో భారీ విమానాశ్రయం సిద్ధమవుతోంది. ఒకే భవనంలో అత్యంత విశాలమైన టెర్మినల్ నిర్మిస్తున్నారు.

ఇది ఏటా 10 కోట్ల ప్రయాణికులకు సేవలందిస్తుందని అంచనా.

డిపార్చర్‌‌కు రెండు అంతస్తులు, అరైవల్‌కు రెండు అంతస్తులు ఉంటాయి. భవనం విస్తీర్ణం 10 లక్షల చదరపు మీటర్లు.

వీడియో క్యాప్షన్,

చైనాకు ఇంత పెద్ద మరో విమానాశ్రయం అవసరమా?

బీజింగ్‌కు ఇంత విశాలమైన మరో విమానాశ్రయం అవసరమా?

"దీన్ని నిర్మించాలనే నిర్ణయం తీసుకునే ముందు సమగ్రమైన అధ్యయనం నిర్వహించాం. 2025 కల్లా బీజింగ్‌లో ప్రయాణికుల సంఖ్య 17 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ విమానాశ్రయానికి, బీజింగ్‌కు మధ్య హైస్పీడ్ రైలు, సబ్‌వే ఉంటాయి" అని విమానాశ్రయ నిర్మాణ విభాగం యి వీయ్ తెలిపింది.

ఈ విమానాశ్రయ నిర్మాణ పనులు 2016లో ప్రారంభమయ్యాయి. ఇంధన వినియోగాన్ని వీలైనంత తగ్గించే విధంగా ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నారు.

100% వర్షపు నీటి సేకరణ వ్యవస్థ, సౌర విద్యుత్తు, ఎలక్ట్రిక్ వాహనాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో దీనిని ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)