ఫ్రిజ్‌లో చాలా రోజులు ఉంచిన ఆహారాన్ని మీరు తింటారా?
- సరోజ్ సింగ్, మనీశ్ జలూయి
- బీబీసీ ప్రతినిధులు

ఫొటో సోర్స్, Getty Images
మీరు ఆహారాన్ని తాజాగా ఉన్నప్పుడే తింటారా లేక ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని కూడా చాలా రోజులు తింటారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం తినడం మంచిదేనా? మైక్రోవేవ్ ఒవెన్ వాడుతున్నారా? ఆహారాన్ని అందులో వేడి చేసినా ఆహారాన్ని మళ్లీ గ్యాస్‌స్టవ్‌పై వేడి చేయాలా? - ఇలాంటి ప్రశ్నలకు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రిజుతా దివేకర్ సమాధానాలిచ్చారు.
రిజుత మాటల్లోనే...
ఆహారాన్ని తినేటప్పుడు కింద కూర్చుని తినాలని భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తోపాటు ఇతర పవిత్ర గ్రంథాలలో రాశారు. అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే- బాగా వండిన తాజా ఆహారాన్నే తినాలి.
మనం ఫ్రిజ్‌ను ఒక నిల్వ కేంద్రంగా వాడుతున్నాం.
ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని వండుకొంటుంటాం. బయటి నుంచి తెప్పించుకొనే ఆహారమూ ఎక్కువగానే ఉంటుంది.
ఇదంతా ఒకేసారి తినలేం. కొన్నిసార్లు తినాలనిపించకపోవడం వల్ల కూడా ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటాం.
తర్వాత దాన్ని వేడి చేసుకొని రెండు మూడు రోజులు కూడా తింటుంటాం.
నా సలహా ఏమిటంటే- ఇంట్లో మైక్రోవేవ్ లాంటివి పెట్టుకోకండి.
ఒకవేళ మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడిచేసినా, తర్వాత గ్యాస్‌పైనా కాస్త వేడి చేయండి. ఉదయం వండిన ఆహారాన్ని సాయంత్రంలోగా తినేయండి.
ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఎక్కువ సేపు పెట్టకండి. ఎందుకంటే అందులో పెడితే ఆహారం పాడైపోవడం నెమ్మదిస్తుందిగాని పూర్తిగా ఆగిపోదు.
ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఎంత తక్కువసేపు పెడితే అంత మంచిది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే- మగవారు వంటగదిలో సాయం చేస్తే, ఫ్రిజ్, మైక్రోవేవ్ అవసరమే ఏర్పడదు.
ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- గోడలు, గార్డులు లేని జైలు... పని చేసుకుని బతికే ఖైదీలు
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- ఈవీఎం వీవీ ప్యాట్ నుంచి రశీదు వస్తుందనుకుంటే పాము వచ్చింది
- డాకర్ ర్యాలీ: 5,600 కి.మీ. అత్యంత క్లిష్టమైన బైక్ రేస్‌ను పూర్తిచేసిన ఏకైక మహిళ
- అయిదోసారీ ఆడపిల్లే పుట్టిందని భార్యను చంపేశాడు
- 'నా అనారోగ్యం వల్ల నా భార్యకూ నరకం కనిపిస్తోంది' -ఉద్దానం బాధితుడి ఆవేదన
- నెలలు నిండకుండానే పిల్లలు ఎందుకు పుడతారు?
- 'అన్ని' డిజైన్లకూ మగవాడే ప్రామాణికం... ఎందుకిలా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)