నేను కాదు, సూడాన్ ప్రజలంతా విప్లవ నాయకులే
సూడాన్ మాజీ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్‌ను గద్దె దించేందుకు జరిగిన విప్లవంలో మహిళలు కీలక పాత్ర పోషించారు.
అందులోనూ 22 ఏళ్ల విద్యార్థిని అలా సలాహ్ ముఖ్య భూమిక పోషించారు. మెరుగైన సూడాన్ కోసం కలలు కన్న ఆమె అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నారు. నిరసనల్లో పాల్గొన్నప్పటి ఆమె వీడియో ఒకటి వైరల్ కావడంతో ప్రపంచమంతా ఆమె నాయకత్వాన్ని చూసింది.
అయితే, అలా మాత్రం.. తనను అంతా విప్లవ నాయకిగా కీర్తిస్తున్నప్పటికీ సూడాన్ ప్రజలంతా ఈ విప్లవంలో పాత్రధారులేనంటున్నారు. నిరసనల్లో పాల్గొన్నప్పుడు తమ ప్రాణాలు పోయినా పోవచ్చునుకున్నామని.. కానీ, ఏమాత్రం భయపడలేదని ఆమె చెప్పారు.
ఈ విప్లవం మహిళలు.. ముఖ్యంగా సూడాన్ యువతుల్లో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపిందని మరో ఉద్యమకారిణి బల్ఘిస్ బద్రి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- లైంగిక వేధింపుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు: నాలుగు ప్రశ్నలు
- నవీన్ పట్నాయక్ మ్యాజిక్ అయిదోసారీ ఫలించనుందా?
- లోక్‌సభ ఎన్నికలు 2019: 24 సార్లు ఓటమి.. ‘ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’
- అమిత్ షా ప్రస్థానం: పోస్టర్లు అంటించే స్థాయి నుంచి పోస్టర్లపై చిత్రాల వరకూ
- బీజేపీ ‘ఆర్టికల్ 370, 35ఎ రద్దు' హామీని వ్యతిరేకిస్తున్న జమ్ముకశ్మీర్ పార్టీలు
- రఫేల్ తీర్పు సమీక్షపై కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- ‘బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కారు’ - అడ్వాణీ
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)