శ్రీలంక పేలుళ్లు: "లెక్కల్లో పొరపాటు జరిగింది. మృతుల సంఖ్య 359 కాదు, 253"- ప్రభుత్వం

  • 25 ఏప్రిల్ 2019
శ్రీలంక పేలుళ్లు Image copyright Getty Images

శ్రీలంక పేలుళ్ల మృతుల సంఖ్యలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు 359 మంది మరణించినట్లు శ్రీలంక ప్రభుత్వం ధ్రువీకరించినప్పటికీ తాజాగా ఆ సంఖ్యను 100కి పైగా తగ్గించింది.

తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మృతులు 253 మంది అని ప్రకటించారు.

లెక్కల్లో పొరపాటు వల్ల మృతుల సంఖ్యను తొలుత ఎక్కువగా ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు.

Image copyright Getty Images

ఆదివారం వరుస ఆత్మాహుతి దాడులతో శ్రీలంక దద్దరిల్లిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలు చోట్ల బాంబులు పేలాయి.

చర్చిలు, హోటళ్లలో బాంబులు పేలడంతో వందలాది మంది మరణించారు.

359 మంది మరణించారని.. 500 మందికిపైగా గాయపడ్డారని తొలుత ప్రభుత్వ లెక్కలు చెప్పినా ఇప్పుడు ఆ సంఖ్యను మార్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)