పాలనే కాదు... వీరు ఇంటింటికీ తిరిగి ప్రేమ, ఆప్యాయతల్నీ డెలివరీ చేస్తున్నారు

  • 3 మే 2019
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీరు ఇంటింటికీ వెళ్లి ఆప్యాయతను పంచుతారు

దక్షిణ కొరియాలో వీధివీధి తిరిగి పాల ఉత్పత్తులు అమ్మే 'డెలివరీ లేడీస్' అక్కడి వృద్ధులకు ఆత్మీయులుగా మారుతున్నారు. ఒంటరిగా ఉంటున్న వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారు.

యాకల్ట్ అనే డెయిరీ సంస్థ 1970ల్లో ఈ డెలివరీ లేడీస్ పద్ధతిని తీసుకువచ్చింది. రోజూ ఒకే ప్రాంతంలో తిరుగుతుండటం వల్ల స్థానికులతో వీరికి మంచి సంబంధాలు ఏర్పడతాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకెల్లా దక్షిణ కొరియాలో వృద్ధాప్యం వేగంగా పెరుగుతోంది. చాలా మంది వృద్ధులు ఇక్కడ ఒంటరి వారవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)