ఫొని అని పేరు పెట్టిన బంగ్లాదేశ్‌పైనే ప్రతాపం చూపిస్తున్న తుపాను

  • 5 మే 2019
బంగ్లాదేశ్‌లో వరద నీటిలో చిక్కుకుపోయిన దంపతులు Image copyright Getty Images
చిత్రం శీర్షిక బంగ్లాదేశ్‌లో వరద నీటిలో చిక్కుకుపోయిన దంపతులు

ఫొని తుపాను భారతదేశం నుంచి బంగ్లాదేశ్ మీదకు మళ్ళింది. అక్కడ అది తన ప్రతాపం చూపింది.

తుపాను ధాటికి వెయ్యికి పైగా ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. కొన్ని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఐదుగురు మరణించగా, 63 మంది గాయపడ్డారు.

ముందస్తు చర్యగా దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ‘‘భారీ విపత్తు వచ్చే భయాందోళన అయితే ఇప్పుడు లేదు’’ అని బంగ్లాదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బంగ్లాదేశ్‌లోని ఖుల్నాలో కూలిన ఇంటికి వద్ద చెల్లాచెదురుగా ఉన్న సామాగ్రిని సేకరించుకుంటున్న కుటుంబ సభ్యులు

నిజానికి, వాయుగుండం శనివారం భారత్ నుంచి బంగ్లాదేశ్ దిశగా కదిలి క్రమంగా బలహీనపడింది. కానీ, తుపాను ధాటికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

నొహ్లీ జిల్లాలో చాలా ఇళ్లు నీటమునిగాయి. ఇక్కడ ఇద్దరు పిల్లలు చనిపోగా, 20 మంది గాయపడ్డారు.

ఫొని తుపాను ధాటికి భారత్‌లోనూ భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

శుక్రవారం నాటికి ఫొని తుపాను మృతుల సంఖ్య 16కు చేరింది. మరోవైపు, ఆస్తి నష్టం భారీగా ఉందని అధికారులు తెలిపారు.

Image copyright EPA

బంగాళఖాతం కేంద్రంగా 1999లో వచ్చిన భారీ తుఫాను కారణంగా ఒడిశాలో 10 వేల మంది చనిపోయారు. అప్పటి నుంచి తుపాను హెచ్చరిక వ్యవస్థను మెరుగుపరిచారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు