ఈ రాజధాని నగరాలు... ఇటీవలి దశాబ్దాలలో వెలిసిన సరికొత్త అద్భుతాలు

  • 11 మే 2019
Jakarta skyline Image copyright Getty Images
చిత్రం శీర్షిక జకార్తా జనాభా పెరగడం, ఏడాదికి 25 సెంటీమీటర్లు చొప్పున మునిగిపోతుండడం కూడా రాజధాని మార్పునకు కారణం

జకార్తా నుంచి రాజధానిని మార్చాలన్న ఇండోనేసియా నిర్ణయం, చాలా దేశాలు చారిత్రక రాజధాని నగరాలను ఎలా విడిచిపెడుతున్నాయనేది చెబుతోంది.

మరో తొమ్మిది రాజధాని నగరాలు దీనికి చెప్పుకోదగిన ఉదాహరణలుగా నిలిచాయి.

ఇండోనేసియా ఈ వారం తమ రాజధానిని జకార్తాకు దూరంగా తరలిస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతోపాటు ప్రపంచంలో అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరాల్లో జకార్తా ఒకటి కావడం అందుకు ప్రధాన కారణం.

రాజధానిని ఎక్కడకు మార్చాలనే దానిపై ఆ దేశ నేతలు ఇప్పటికీ చర్చలు జరుపుతున్నారు. కానీ ఆ దేశంలో ఏప్రిల్ మొదట్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో మాత్రం కొత్త రాజధానిని బోర్నియో ద్వీపంలో నిర్మించడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

ఆ ద్వీపంలోని బంజరు భూములను రాజధానిగా మార్చడానికి ఇండోనేసియా అందరూ వెళ్లిన ఒక దారినే అనుసరించాల్సి ఉంటుందనేది కచ్చితం. అలా రాజధానులు మార్చుకున్న కొన్ని దేశాలేవో, వాటి ప్రత్యేకతలేమిటో చూద్దాం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మయన్మార్ కొత్త రాజధాని నైప్యిడావ్‌లోని చాలా భవనాల్లో ఇప్పటికీ జనం కొరత ఉంది

నైప్యిడావ్, మయన్మార్(2005)

పాత రాజధాని యాంగాన్ నుంచి మార్చడానికి కారణం అక్కడ జనాభా ఎక్కువై, నగరం ఇరుకుగా మారిపోవడమేనని ఆ దేశం అధికారికంగా వివరణ ఇచ్చింది. కానీ, దీనికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి.

నైప్యిడావ్ దేశానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో దేశంలో దూరప్రాంతాల్లో ఎక్కడ తిరుగుబాట్లు జరిగినా ప్రబుత్వం వాటిని సమర్థంగా అణచివేయడానికి వీలుగా ఉంటుంది.

మయన్మార్‌లోని చాలా మంది రాజధాని మార్పునకు అసలు కారణం మిలిటరీ జుంటానే అని భావిస్తున్నారు.

1962 నుంచి దేశాన్ని పాలించిన అది కొత్తరాజధాని చుట్టూ ఉన్న నివసించడానికి వీల్లేని భూభాగం ఉండడంతో, ఇక్కడ తిరుగుబాట్లు, విదేశీ జోక్యం లేకుండా సురక్షితంగా ఉండవచ్చని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మలేసియాకు పుత్రజయ పాక్షికంగా నూతన రాజధానిగా మారింది.

పుత్రజయ, మలేసియా(2002)

పక్కా ప్రణాళిక ప్రకారం నిర్మించిన ఈ నగరం ఇప్పుడు మలేసియా ప్రభుత్వ పరిపాలనా కేంద్రంగా ఉంది. కానీ కౌలాలంపూర్‌ కూడా అధికారిక రాజధానిగా కొనసాగుతోంది.

తరచూ ఆర్కిటెక్చర్ అద్భుతంగా వర్ణించే పుత్రజయ తన వైపు అడుగులు వేయకుండా మలేసియా అధికారులను ఆపలేకపోయింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మధ్య ఆసియాలో అత్యంత ఆధునిక నగరాల్లో కజక్ రాజధాని అస్తానా ఒకటి

ఆస్తానా(నూర్-సుల్తాన్), కజకిస్తాన్(1997)

రాజధాని అనే అర్థం వచ్చే కజక్ పదంతో తగిన పేరు పెట్టుకున్న అస్తానా నగరాన్ని 1997లో అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బయేవ్ ఆదేశాలతో నిర్మించారు.

ఆకాశాన్నంటే అత్యాధునిక భవనాలున్న ఇది చాలా వేగంగా మధ్య ఆసియాలోని అత్యంత ఆధునిక నగరాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ ఏడాది ప్రారంభంలో నజర్బయేవ్ రాజీనామాతో కజక్ అధికారులు తర్వాత దీనికి నూర్-సుల్తాన్ అని పేరు మార్చారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక లాగోస్‌లో పెరిగిన జనాభా, మౌలిక వసతుల లోటు రాజధానిని అబుజాకు మార్చేలా చేసింది

అబుజా, నైజీరియా(1991)

నైజీరియా రాజధానిని 1991లో లాగోస్ నుంచి అబూజాకు మార్చారు. దేశంలోని మూడు ప్రధాన జాతుల బృందాలు యోరుబా, ఇగ్బో, హౌసా-ఫులానికి స్వతంత్ర నగరంగా సృష్టించే ప్రయత్నాల్లో భాగంగా దీనిని నూతన రాజధానిగా చేశారు.

కానీ లాగోస్‌ నగర జనాభా 1970లో 14 లక్షల నుంచి గత ఏడాదికి 2 కోట్లకు పైగా పెరగడం, మౌలిక సదుపాయాల సమస్యలు కూడా తలెత్తడంతో ఈ మార్పు అనివార్యమైంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1967 తర్వాత ఇస్లామాబాద్ పాకిస్తాన్ అధికారిక రాజధాని అయ్యింది

ఇస్లామాబాద్, పాకిస్తాన్(1967)

పాకిస్తాన్ రాజధానిని దేశాన్ని ఏకీకృతం చేసే ప్రయత్నాల్లో భాగంగా కూడా నిర్మించారు.

1947 ఆగస్టులో భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి కరాచీ దాని పాలనా కేంద్రంగా ఉంది.

కానీ, చుట్టూ ఎడారి ఉండడం, నీటి కొరత తీవ్రంగా ఉండండతో ఇది రాజధాని పాత్ర పోషించడం అసాధ్యంగా మారింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రెజిల్ పర్వత ప్రాంతాల్లోని బంజరు భూముల్లో బ్రెజిలియాను నిర్మించారు

బ్రెజిలియా, బ్రెజిల్(1960)

రియో డి జెనీరో బ్రెజిల్ ప్రముఖ నగరం. ఇది 17వ శతాబ్దం నుంచీ ఆ దేశానికి రాజధానిగా ఉంది.

కానీ 1960లో ఆ హోదా బ్రెజిలియా సొంతమైంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.

సముద్ర వైపు నుంచి జరిగే దాడులకు రియో బలహీనంగా ఉందని చారిత్రకంగా నిరూపితం కావడంతో అక్కడి నుంచి రాజధానిని మార్చాలని 1891లోనే నిర్ణయించారు.

దేశాన్ని ఏకం చేయడానికి, శత్రువుల నుంచి అప్రమత్తంగా ఉండడానికి బ్రెజిలియాను దేశంలో పశ్చిమంగా పర్వత ప్రాంతాల్లో నిర్మించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక క్యూజన్ సిటీ రాజధాని హోదా 1976లో మనీలాకు దక్కింది

క్యూజన్ సిటీ, ఫిలిప్పీన్స్(1948)

క్యూజన్ సిటీ ఫిలిప్పీన్స్‌కు రాజధానిగా ఉండే గౌరవాన్ని గెలుచుకుంది. 1940లో అధ్యక్షుడు మాన్యూల్ క్యూజాన్ కనుగొనడంతో దీనికి ఆయన పేరే పెట్టారు.

కానీ ప్రభుత్వానికి సంబంధించిన చాలా కార్యకలాపాలు 1976లో ప్రాక్టికల్ కారణాలతో రాజధాని హోదాను దక్కించుకున్న మనీలాలోనే ఉండిపోయాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సిడ్నీ, మెల్‌బోర్న్ పోటీ మధ్య కాన్‌బెర్రా ఆస్ట్రేలియా రాజధాని అయ్యింది

కాన్‌బెర్రా, ఆస్ట్రేలియా(1927)

ఆస్ట్రేలియా రాజధానిని దేశంలోని రెండు అధికార కేంద్రాలైన సిడ్నీ, మెల్‌బోర్న్ మధ్య రాజీ కుదిరేలా నిర్మించారు.

ఈ గౌరవాన్ని మొదట ఆ రెండు నగరాలూ పొందాలనుకున్నాయి.

కానీ, రాజధాని నిర్ణయాన్ని 1908లోనే తీసుకున్నారు. పార్లమెంటును కాన్‌బెర్రాకు తరలించింది మాత్రం 1927లోనే.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1931లో న్యూ దిల్లీలో రాజధానిగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి

న్యూ దిల్లీ, భారత్(1911)

భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు శతాబ్దానికి పైగా కోల్‌కతా రాజధానిగా ఉండింది.

కానీ, కోల్‌కతా చుట్టుపక్కల, బెంగాల్ ప్రాంతంలో బ్రిటిష్ పాలనపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో 1911లో రాజధానిని దిల్లీకి మార్చారు.

1648 నుంచి 1857 వరకూ మొఘలు సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న దిల్లీ పాత నగరానికి సమీపంలో కొత్త రాజధానిని నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం