ఆస్ట్రేలియన్ డాలర్: 4.6 కోట్ల నోట్లపై అక్షర దోషం.. ఆర్నెల్లకు బయటపడింది

  • 10 మే 2019
ఆస్ట్రేలియా కరెన్సీ నోటు Image copyright RESERVE BANK OF AUSTRALIA

ఆస్ట్రేలియా రిజర్వు బ్యాంకు అచ్చుతప్పు చేసింది.

''responsibility'' (రెస్పాన్సిబిలిటీ) అనే పదాన్ని ''responsibilty'' అని తప్పుగా పేర్కొంటూ దాదాపు 4.6 కోట్ల కరెన్సీ నోట్లను ముద్రించింది.

‘50 ఆస్ట్రేలియన్ డాలర్ల’ నోట్లు ఇలా తప్పుగా అచ్చయ్యాయి.

ఆస్ట్రేలియాలో అత్యధికంగా చెలామణీ అయ్యేది ఈ నోటే.

ఆ దేశ పార్లమెంటు తొలి మహిళా సభ్యురాలు ఎడిత్ కోవన్ చిత్రంతో ముద్రించిన ఈ నోట్లను గతేడాది చివర్లో విడుదల చేశారు.

దొంగ నోట్లను అరికట్టేందుకు అధునాతన భద్రత ప్రమాణాలతో వీటిని రూపొందించారు.

నోటుపై ఎడిత్ చిత్రం పక్కనే పార్లమెంటులో ఆమె చేసిన తొలి ప్రసంగంలోని కొంత భాగాన్ని ముద్రించారు.

చాలా చిన్న అక్షరాలతో ముద్రించిన ఈ ప్రసంగంలో రెస్పాన్సిబిలిటీ పదం పలు సార్లు వచ్చింది.

ప్రతి చోటా దాన్ని అక్షర దోషంతోనే అచ్చువేశారు.

అయితే, భూతద్దంతో చూస్తే గానీ ఈ తప్పు కనిపించదు.

అందుకే, ఈ అక్షర దోషం బయటపడేందుకు దాదాపు ఆరు నెలలు పట్టింది.

Image copyright RESERVE BANK OF AUSTRALIA

అచ్చుతప్పు జరిగిన మాట వాస్తవేమనని ఆస్ట్రేలియా రిజర్వు బ్యాంకు ధ్రువీకరించింది.

భవిష్యత్తు ముద్రణల్లో తప్పును సరిచేస్తామని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం