మహా సముద్రం అట్టగుడున ప్లాస్టిక్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు

  • 15 మే 2019

ఇది పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతైన మెరియానా ట్రెంచ్ ప్రాంతం.

ఒక ప్రత్యేక జలాంతర్గామిలో అమెరికా అన్వేషకుడు విక్టర్ వెస్కోవో దీని అడుగును తాకారు.

మహా సముద్రాల్లో అత్యంత లోతుల్లోకి చేరిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు.

అంత లోతులో కూడా ఆయనకు అక్కడ ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ కనిపించింది.

మహా సముద్రంలో 11 కి.మీ. లోతుకు చేరిన ఆయన నాలుగు కొత్త చేప జాతులు కనుగొన్నారు.

అంత లోతులో ఉండే ఒత్తిడిని తట్టుకునేలా ఈ జలాంతర్గామిని నిర్మించారు.

ప్రపంచంలోని ఐదు మహాసముద్రాల్లో అత్యంత లోతులను చేరాలని విక్టర్ ప్రయత్నిస్తున్నారు.

దీని తర్వాత ఆయన అర్కిటిక్ మహా సముద్రంలోని 'మాలీ డీప్' లోతుల్లోకి చేరాలనుకుంటున్నారు.

ఈ వివరాలను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)