చిలీలో ప్రపంచంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్స్ పాఠశాల
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: చిలీలో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్స్ పాఠశాల

  • 16 మే 2019

మనకు రకరకాల స్కూళ్ల గురించి తెలుసు. కానీ చిలీలో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక స్కూల్ ఉంది. ఈ స్కూలును ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్స్ కోసమే ఏర్పాటు చేశారు. దీని పేరు అమరాంటా స్కూల్.

మెక్సికో ట్రాన్స్‌జెండర్ రాజకీయ నాయకుడు 'అమరాంటా గోమెజ్ రీగలాడో' పేరునే ఈ స్కూలుకు పెట్టారు.

ఆరు నుంచి 17 ఏళ్ల వయసున్న ట్రాన్స్‌జెండర్స్ ఇక్కడ చదువుకోవచ్చు.

గత ఏడాది ప్రారంభించిన ఈ ట్రాన్స్‌జెండర్స్ స్కూల్లో మొత్తం 38 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 23 మందిని ట్రాన్స్‌జెండర్లుగా గుర్తించారు.

ఇక్కడ చదివే మిగతా విద్యార్థులందరూ ట్రాన్స్‌జెండర్ పిల్లల స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు.

ఇక్కడ చదువుతున్న వారందరూ ఈ ఏడాది స్టేట్ బోర్డ్ పరీక్షలు రాయబోతున్నారు.

స్కూల్లో సాధారణ జీవితం గడిపుతున్నామని, ట్రాన్స్‌జెండర్‌గా ఉండడమంటే తమకు స్వేచ్ఛ ఉన్నట్టే అని ఇక్కడ చదివే పిల్లలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)