భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పాకిస్తాన్‌లో ఉత్కంఠ
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: భారత ఎన్నికలపై పాకిస్తాన్ ఏమనుకుంటోంది?

  • 16 మే 2019

సాధారణంగా భారత రాజకీయ వ్యవహారాలపై పాకిస్తాన్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పుల్వామా దాడి తర్వాత భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కూడా పాక్ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. భారత్‌లో ఏ పార్టీ గెలుస్తుందా అని ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అందుకే భారత్‌లో ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం, పాకిస్తాన్‌పై ఎలా ఉండబోతోందో బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ తెలుసుకునే ప్రయత్నం చేశారు.

కర్తార్‌పూర్ కారిడార్లో అభివృద్ధి, రెండు దేశాల మధ్య చర్చల పునరుద్ధరణ విషయంలో భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చాలా కీలకమని పాకిస్తాన్ భావిస్తోంది.

రెండు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతి లేకపోయినా ఎన్నికలు పూర్తయితే ఉద్రిక్తతలు తగ్గవచ్చని పాకిస్తాన్ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)