కుంచించుకుపోతున్న చంద్రుడు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

చంద్రకంపాలతో చిక్కిపోతున్న చందమామ

  • 16 మే 2019

పౌర్ణమి రోజున వెండి వెన్నెల కురిపించే చంద్రుడికి కూడా కష్టమొచ్చింది.

చంద్రుడు కుంచించుకుపోతున్నట్టు నాసా చెబుతోంది.

ఇది ఇప్పటికిప్పుడే జరుగుతోంది కాదు. గత కొన్ని కోట్ల సంవత్సరాలుగా చంద్రుడు దాదాపు 50 మీటర్లు ముడుచుకుపోయాడని నాసా తెలిపింది.

చంద్రుడు కుంచించుకుపోవడం వల్ల దాని ఉపరితలంపై ముడతలు వస్తున్నాయి.

చంద్రుడిపై అవి ఎండుద్రాక్షపై ముడతల్లా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చంద్రుడి కేంద్రభాగం మెల్లమెల్లగా చల్లబడుతుండడమే దీనికి కారణం.

దానివల్ల ఉపరితలంపై పగుళ్లు కూడా వస్తున్నాయి.

చంద్రుడు ముడుచుకుపోవడంతో రిక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో 'చంద్రకంపాలు' కూడా వస్తున్నాయి.

చంద్రుడిపై అపోలో దిగినప్పటి నుంచి మనం ఆ చంద్రకంపాలను కొలవగలుగుతున్నాం.

వాటిని కొలవడానికి వ్యోమగాములు చంద్రుడిపై సెసిమోమీటర్లు అమర్చారు.

మరిన్ని వివరాలకు పై వీడియోను చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)