ఆస్ట్రియా ప్రభుత్వాన్ని కూల్చిన రహస్య వీడియో

  • 28 మే 2019
వీడియో

రష్యా యువతితో ఆస్ట్రియా ఫ్రీడం పార్టీ నేత ఉన్నట్టు ఒక వీడియో లీక్ అవడంతో మొదలైన వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు.

ఈ కుంభకోణం వల్ల ఆస్ట్రియాలో ప్రస్తుత ప్రభుత్వం కుప్పకూలింది. ఆస్ట్రియా చాన్స్‌లర్ సెబాస్టియన్ ఖర్జ్‌ పదవి కోల్పోయారు.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఖర్జ్ తగిన మద్దతు పొందలేకపోయారు.

ఈ అవిశ్వాస తీర్మానానికి ఫ్రీడం పార్టీ, ప్రతిపక్ష పార్టీ సోషల్ డెమాక్రట్స్ మద్దతు ఇచ్చారు.

ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలన్, ప్రస్తుత వైస్ చాన్సలర్ హర్ట్‌వింగ్ లాంగర్‌ను తాత్కాలిక నేతగా నియమించారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక అవిశ్వాస తీర్మానంలో మద్దతు పొందలేకపోయిన ఖర్జ్

వీడియోతో మొదలైన వివాదం

నిజానికి ఈ వివాదం జర్మన్ మీడియా ఒక వీడియో పబ్లిష్ చేయడంతో మొదలైంది.

ఆ వీడియోను 2017లో స్పెయిన్ దీవి ఇబిసాలో రహస్యంగా చిత్రీకరించారు. ఇది 2017లో దేశంలో జరిగిన ఎన్నికలకు ముందు తీసిన వీడియో.

జర్మన్ మీడియా ప్రసారం చేసిన ఈ వీడియో ఫుటేజిలో ఫ్రీడం పార్టీ నేత, జర్మనీ ప్రస్తుత ప్రభుత్వంలో వైస్ చాన్సలర్‌గా ఉన్న హెనిజ్ క్రిస్టియన్ స్టార్క్‌, తమ పార్టీకే చెందిన కీలక నేత జొహన్నా గుడ్‌నెస్‌తో మాట్లాడుతుండడం కనిపిస్తోంది.

ఈ వీడియోలో ఇద్దరు నేతలు ఒక రష్యా మహిళతో కూచుని డ్రింక్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ మహిళ ఒక రష్యా వ్యాపారి మేనకోడలు అని చెబుతున్నారు.

ఈ వీడియోలో స్టార్క్, ఆ మహిళతో ఆస్ట్రియా వార్తా పత్రిక 'క్రోనెన్ జుటుంగ్‌'లో ఒక పెద్ద వాటాను కొనుగోలు చేసి, ఫ్రీడం పార్టీకి సాయం చేయాలని కోరుతున్నారు. బదులుగా తాము ఆమెకు సాయం చేస్తామని అంటున్నారు.

ఈ వీడియోను ఎవరు షూట్ చేశారనే విషయం తెలీడం లేదు. కానీ ఇది వెలుగుచూసిన కొన్ని గంటల తర్వాత స్టార్క్‌ను తొలగించాలని ఖర్జ్ నిర్ణయించారు. దాంతో స్టార్క్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఫ్రీడం పార్టీలోని ఇతర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. దాంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.

Image copyright EPA
చిత్రం శీర్షిక వీడియో బయటపడగానే క్రిస్టియన్ స్టార్క్ రాజీనామా చేశారు

పార్లమెంటులో ఏం జరిగింది

ఆస్ట్రియా పీపుల్స్ పార్టీ చీఫ్ సెబాస్టియన్ ఖర్జ్ ఆ దేశంలో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయిన మొట్ట మొదటి చాన్సలర్‌గా నిలిచారు.

పార్లమెంటులో విపక్షాలు కుర్జ్‌కు వ్యతిరేకంగా, అతడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెట్టాయి. ఆ రెండింటిలో విజయం సాధించింది.

అయితే యూరోపియన్‌ యూనియన్‌కు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఖర్జ్‌కు సుమారు 35 శాతం ఓట్లు లభించాయి. ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి ఆయనకు ఆ మద్దతు కూడా పనికిరాకుండాపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పశ్చిమాసియాలో అమెరికా అదనపు బలగాల మోహరింపు.. ఇవి ఇరాన్‌తో యుద్ధానికి సన్నాహాలేనా..

భారత్-పాక్ మ్యాచ్: ప్రధాని ఇమ్రాన్ వద్దన్నవన్నీ చేసిన కెప్టెన్ సర్ఫ్‌రాజ్

శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయడి

సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’

కాళ్లు, చేతులు కట్టేసుకుని నదిలోకి దిగాడు.. మ్యాజిక్‌ చేసి బయటకు వస్తానన్నాడు. కానీ..

అగ్రకులాలపై దళిత మహిళల తిరుగుబాటు.. భూమిపై హక్కుల కోసం పంజాబ్‌లో పోరాటం

క్రికెట్ ప్రపంచకప్ 2019: బిజినెస్ ఎంతో ఊహించగలరా..

శోభనం రాత్రి బెడ్‌షీట్లు ఏం నిరూపిస్తాయి.. పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి