ధోనీ, కేఎల్ రాహుల్ సెంచరీలు.. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 95 పరుగులతో భారత్ విజయం

  • 29 మే 2019
ఎంఎస్ ధోనీ మహేంద్ర సింగ్ ధోనీ Image copyright Getty Images

క్రికెట్ ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్ జట్టుతో కార్డిఫ్‌లో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు భారీ విజయం సాధించింది.

భారత్ బంగ్లాదేశ్‌ను 95 రన్స్ తేడాతో ఓడించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మహేంద్ర సింగ్ ధోనీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో 359 రన్స్ చేసింది. 360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 264 పరుగులే చేయగలిగింది.

రెండు వికెట్లు త్వరగానే కోల్పోయిన బంగ్లాదేశ్ జట్టును ఓపెనర్ లిటన్ దాస్, వికెట్ కీపర్ రహీమ్ ఆదుకున్నారు. కానీ 73 పరుగులు చేసిన లిటన్ దాస్‌ను స్పిన్నర్ యజువేంద్ర చహల్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌ స్టంప్డ్ చేశాడు.

బాగా ఆడుతున్న ముష్ఫికర్ రహ్మాన్ కూడా 90 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర కులదీప్ యాదవ్ బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వరసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.

జట్టులో మెహిదీ హసన్, మహమ్మద్ సైఫుద్దీన్ మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ముగ్గురు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయ్యారు.

49.3 ఓవర్లలో బంగ్లాదేశ్ 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

భారత్ బౌలర్లలో కులదీప్ యాదవ్, యజువేంద్ర చహల్ మూడేసి వికెట్లు తీయగా, జస్‌ప్రీత్ బుమ్రా 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

Image copyright Getty Images

అంతకు ముందు...

భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్‌లో 78 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్ల సహాయంతో 113 పరుగులు సాధించాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ సైతం 99 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 108 పరుగులు చేశాడు.

మిగతా బ్యాట్స్‌మెన్లలో.. శిఖర్ ధావన్ 1, రోహిత్ శర్మ 19, కెప్టెన్ విరాట్ కోహ్లీ 47, విజయ్ శంకర్ 2, హార్దిక్ పాండ్యా 21, రవీంద్ర జడేజా 11, దినేశ్ కార్తీక్ 7 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్‌లో ధోనీ, దినేశ్ కార్తీక్ ఇద్దరూ కీపింగ్ చేశారు.

బంగ్లాదేశ్ బౌలర్లలో రూబెల్ హొస్సైన్, షకీబ్ అల్ హసన్ చెరో రెండు వికెట్లు, ముస్తఫిజుర్ రహ్మాన్, మొహమ్మద్ సైఫుద్దీన్, సబ్బీర్ రహ్మాన్ తలా ఒక వికెట్ తీశారు.

వరల్డ్ కప్‌లో భారత్ జూన్ 5న తన తొలి మ్యాచ్‌‌లో దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పశ్చిమాసియాలో అమెరికా అదనపు బలగాల మోహరింపు.. ఇవి ఇరాన్‌తో యుద్ధానికి సన్నాహాలేనా..

భారత్-పాక్ మ్యాచ్: ప్రధాని ఇమ్రాన్ వద్దన్నవన్నీ చేసిన కెప్టెన్ సర్ఫ్‌రాజ్

శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయడి

సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’

కాళ్లు, చేతులు కట్టేసుకుని నదిలోకి దిగాడు.. మ్యాజిక్‌ చేసి బయటకు వస్తానన్నాడు. కానీ..

అగ్రకులాలపై దళిత మహిళల తిరుగుబాటు.. భూమిపై హక్కుల కోసం పంజాబ్‌లో పోరాటం

క్రికెట్ ప్రపంచకప్ 2019: బిజినెస్ ఎంతో ఊహించగలరా..

శోభనం రాత్రి బెడ్‌షీట్లు ఏం నిరూపిస్తాయి.. పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి