‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డల వాడకానికి ఈ కప్పులే సమాధానమా?

  • 29 మే 2019
మెన్‌స్ట్రువల్ కప్‌

మలావీలో ఒక ప్యాకెట్ శానిటరీ ప్యాడ్లు కొనాలంటే ఒక రోజు జీతమంతా ఖర్చుపెట్టాలి. దానికి బదులుగా రుతుస్రావం సమయంలో పాత గుడ్డలు వాడుతుంటారు. కానీ అవి సరిపోవు. దీంతో బడి మానేస్తున్నారు. చదువులో వెనుకబడుతున్నారు.

ఈ పరిస్థితిని పీరియడ్ పావర్టీ అని వ్యవహరిస్తున్నారు కొందరు పరిశీలకులు. ఆ బాలికలకు సాయం చేయటానికి ఓ స్వచ్ఛంద సంస్థ నడుం కట్టింది. వారికి పీరియడ్ కప్పులు అందిస్తోంది.

ఈ కప్‌లు చాలా చౌక. ఒక్కో కప్పును పదేళ్ల పాటు వాడొచ్చు. పైగా వ్యర్థాలూ ఉండవు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ‘పీరియడ్’ పేదరికానికి ఈ బహిష్టు కప్పులు ముగింపు పలుకుతాయా?

‘‘ఈ మెన్‌స్ట్రువల్ కప్పుని యోని ద్వారా లోపల పెట్టాలి. ఈ రింగ్‌లు పట్టుకుని బయటకు తీయాలి. ఇలా నొక్కి తీయాలి’’ అని ఈ కప్పులు ఎలా ఉపయోగించాలో మలావీ మహిళలు, బాలికలకు ల్యూసీ ఖోమా బోధిస్తున్నారు.

‘‘మొదట నాకు భయమేసింది. ఈ కప్పు చాలా పెద్దదిగా కనిపించింది. దీనిని వాడటం మొదలుపెట్టినపుడు నొప్పిగా అనిపించి తీసివేశాను. రెండోసారి.. ఎప్పటి నుండో వాడుతున్నట్లు అలవాటైపోయింది’’ అని ఓ బాలిక వివరించింది.

ఈ కప్పులను మూడు, నాలుగు నిమిషాలు నీటిలో మరిగించి శుభ్రంచేస్తారు. వీటి వాడకంతో లీకవ్వటం, దుర్వాసన కూడా పోయాయని బాలికలు చెప్తున్నారు.

‘‘ఈ మెన్‌స్ట్రువల్ కప్పు రాకతో పరిస్థితి చాలా బాగా మెరుగయ్యింది. ఇప్పుడు రుతుస్రావం సమస్య వల్ల బాలికలు బడి మానేయటం లేదు’’ అని స్కూల్ హెడ్‌టీచర్ తెలిపారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)