వర్జీనియా బీచ్ కాల్పులు: ప్రభుత్వ భవనంలో ఫైరింగ్, 12 మంది మృతి

  • 1 జూన్ 2019
వర్జీనియా బీచ్ కాల్పులు Image copyright Reuters
చిత్రం శీర్షిక గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు

అమెరికాలోని వర్జీనియాలో ఒక ప్రభుత్వ భవనంలో జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందినట్లు, మరో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు, చాలా కాలం నుంచి వర్జీనియా బీచ్ సిటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రజా ప్రయోజనాల భవనంలో అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని చెప్పారు.

పోలీసుల ఎదురు కాల్పుల్లో నిందితుడు మరణించాడు. అతడెవరన్నది పోలీసులు బయటపెట్టలేదు.

శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం 4 గంటల తర్వాత కాల్పులు మొదలైనట్లు చెబుతున్నారు. నిందితుడు తమపై కాల్పులు జరపడంతో అతడిని కాల్చి చంపినట్లు స్థానిక పోలీస్ చీఫ్ జేమ్స్ కెర్వెరా తెలిపారు.

గాయపడ్డ ఆరుగురిలో ఒక పోలీస్ కూడా ఉన్నాడని చెప్పారు.

నిందితుడు ఒంటరిగా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అతడి కాల్పుల వెనక ఉద్దేశం ఏంటో ఇంకా తెలీలేదు.

"ఇది వర్జీనియా బీచ్ చరిత్రలో అత్యంత దారుణమైన రోజు" అని మేయర్ రాబర్ట్ డేయర్ మీడియా సమావేశంలో అన్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక కాల్పులు జరిగిన వర్జీనియా బీచ్ మునిసిపల్ సెంటర్

చుట్టూ ఉన్న మిగతా ప్రభుత్వ భవనాలన్నీ మూసివేసి, ఉద్యోగులను ఖాళీ చేయించారు.

భవనాల్లోంచి దిగుతున్నప్పుడు జనం అరవడం, గట్టిగా ఏడవడం వినిపించిందని ఒక భవనంలోని ఉద్యోగి చెప్పారు.

ఏపీ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన మరో ఉద్యోగి తమకు కాల్పుల శబ్దం వినిపించిందని, కానీ అవి అంత దగ్గరగా జరుగుతున్నాయని అనుకోలేదని చెప్పారు.

బాధితులు ఎవరు

ఈ కాల్పుల్లో 12 మంది మృతుల గురించి అధికారులు ఏ వివరాలూ విడుదల చేయలేదు.

వైట్ హౌస్ అధికారులు ఈ ఘటన గురించి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు సమాచారం అందించారు.

'నగరానికి, రాష్ట్రానికి 'విషాదకరమైన రోజు'గా వర్జీనియా గవర్నర్ రాల్ఫ్ నార్తామ్ ఈ ఘటనను వర్ణించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఎఫ్‌బీఐ కాల్పుల ఘటనను దర్యాప్తు చేస్తున్న అధికారులకు సహకరిస్తోందని అమెరికా మీడియా చెప్పింది.

తుపాకీ కాల్పుల గణాంకాలను నమోదు చేస్తున్న ఒక వెబ్‌సైట్ వివరాల ప్రకారం అమెరికాలో ఈ ఏడాది కాల్పులు జరగడం ఇది 150వ సారి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పశ్చిమాసియాలో అమెరికా అదనపు బలగాల మోహరింపు.. ఇవి ఇరాన్‌తో యుద్ధానికి సన్నాహాలేనా..

భారత్-పాక్ మ్యాచ్: ప్రధాని ఇమ్రాన్ వద్దన్నవన్నీ చేసిన కెప్టెన్ సర్ఫ్‌రాజ్

శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయడి

సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’

కాళ్లు, చేతులు కట్టేసుకుని నదిలోకి దిగాడు.. మ్యాజిక్‌ చేసి బయటకు వస్తానన్నాడు. కానీ..

అగ్రకులాలపై దళిత మహిళల తిరుగుబాటు.. భూమిపై హక్కుల కోసం పంజాబ్‌లో పోరాటం

క్రికెట్ ప్రపంచకప్ 2019: బిజినెస్ ఎంతో ఊహించగలరా..

శోభనం రాత్రి బెడ్‌షీట్లు ఏం నిరూపిస్తాయి.. పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి