హోర్ముజ్ జలసంధిలో సంక్షోభం ప్రపంచం మీద చూపే ప్రభావం ఏమిటి?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

హోర్ముజ్ జలసంధిలో సంక్షోభం ప్రపంచం మీద చూపే ప్రభావం ఏమిటి?

  • 10 జూన్ 2019

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరప్రాంత సముద్రంలో నాలుగు ఆయిల్ ట్యాంకర్ల మీద దాడులకు కారణం ఇరాన్ అని అమెరికా ఆరోపించింది. ఆ ఆరోపణలను ఇరాన్ తిరస్కరిస్తోంది.

ఇరాన్ మీద ఆంక్షల మినహాయింపులను అమెరికా ఏప్రిల్‌లో రద్దు చేసింది.

ఫలితంగా ఇరాన్ చమురు ఎగుమతులను నిషేధించినట్లయింది.

దీంతో అమెరికా - ఇరాన్‌ల మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్నాయి.

తమ చమురు ఎగుమతులను నిలిపివేస్తే హోర్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా జరగకుండా అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.

చమురు రవాణాలో ప్రపంచంలో అత్యంత రద్దీ కేంద్రమైన హోర్ముజ్ జలసంధి సంక్షోభంలో చిక్కుకుంటే ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలకు రెక్కలు వస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)