శృంగారం సాంకేతిక అభివృద్ధికి ఎలా దోహదపడింది... ప్రాచీన గుహల నుంచి ఇంటర్నెట్ యుగం దాకా దాని ప్రభావం ఏమిటి?

  • 12 జూన్ 2019
ఇంటర్నెట్ ఫర్ పోర్న్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎవెన్యూ క్యూ పప్పెట్ షోలో 'ఇంటర్నెట్ ఫర్ పోర్న్' అని పాడిన ట్రాకీ మాన్‌స్టర్ పాత్ర

సుమారు 15 ఏళ్ల ముందు 'ఎవెన్యూ క్యూ' అనే ఒక మ్యూజికల్ కామెడీ షో ఉండేది.

అందులోని ట్రాకీ మాన్‌స్టర్ అనే పాత్ర "ద ఇంటర్నెట్ ఈజ్ ఫర్ పోర్న్" అంటే ఇంటర్నెట్ పోర్న్ కోసమే అంటూ ఒక పాట పాడుతుంది.

ఇందులో కేట్ మాన్‌స్టర్ అనే పాత్ర కొనుగోళ్ల కోసం, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఇంటర్నెట్ చాలా పనికొచ్చిందని దాని గొప్పతనం గురించి చెబుతుంటే, దాని పక్కింట్లో ఉండే ట్రాకీ మాన్‌స్టర్ జనం ఇంటర్నెట్‌ను పోర్న్ చూడ్డానికే ఎక్కువ ఉపయోగిస్తున్నారని చెబుతుంది.

అది నిజమేనా అని ఒకసారి ఆలోచిస్తే, కొంత వరకు, కానీ పూర్తిగా కాదు అని చెప్పచ్చు.

గణాంకాలను బట్టి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసే ఏడుగురిలో ఒకరు పోర్న్ గురించే సెర్చ్ చేస్తారని తెలుస్తోంది. ఇది చిన్న విషయమేం కాదు. కానీ ఆ ఏడుగురిలో ఆరుగురు దాని గురించి సెర్చ్ చేయడం లేదనే విషయం కూడా మనం చెప్పుకోవాలి.

ఇంటర్నెట్‌లో అత్యధికంగా సెర్చ్ చేసే 'పోర్న్‌హబ్' వెబ్‌సైట్‌కు దాదాపు నెట్‌ఫ్లిక్స్, లింకిడిన్ అంత పాపులారిటీ ఉంది.

దీనికి అంత పాపులారిటీ ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ విషయంలో ఇది 28వ స్థానంలో ఉంది.

'ఎవెన్యూ క్యూ' షో మొదటిసారి 2003లో వచ్చింది. ఇంటర్నెట్ భాషలో చెప్పాలంటే, అంతకంటే ముందే వచ్చింది. ఆ సమయంలో ట్రాకీ మాన్‌స్టర్ చెబుతున్నదే నిజం అయ్యుండచ్చు.

సాధారణంగా ఏ కొత్త టెక్నాలజీ అయినా ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. దానిపై జనం విశ్వసనీయత తక్కువ ఉంటుంది.

ప్రజలు దానికి త్వరగా అలవాటు పడడానికి, ఆ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడానికి వీలుగా ఒక మార్కెట్ అవసరం అవుతుంది.

ఆ టెక్నాలజీ చౌకగా, ఎక్కువ విశ్వసనీయతతో ఉన్నప్పుడు మార్కెట్‌లోని ఒక పెద్ద భాగం దాని పట్టులోకి వెళ్లిపోతుంది. అదే టెక్నాలజీని మిగతా చాలా రంగాల్లో ఉపయోగించడం కూడా మొదలవుతుంది.

ఇదే సిద్ధాంతం ఆధారంగా పోర్నోగ్రఫీ కూడా ఇంటర్నెట్, దానికి సంబంధించిన ఇతర టెక్నాలజీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. పోర్నోగ్రఫీ నిజంగానే ఇంటర్నెట్‌ను వృద్ధి చేస్తోందా.

కళల ఆవిర్భావం నుంచి సెక్స్ వాటిలో ఒక అంశంగా ఉంటూ వచ్చింది. చరిత్రపూర్వం గుహల గోడలపైనే మనుషులు శరీరంలోని మర్మాంగాల చిత్రాలు వేసేవారు.

సన్నిహితంగా ఉన్న జంటల చిత్రాలను 11 వేల ఏళ్ల క్రితమే చిత్రించారని పరిశోధకులు గుర్తించారు. మెసపటోమియాలోని ఒక కళాకారుడు 4 వేల ఏళ్ల క్రితమే స్త్రీ, పురుషులు సన్నిహితంగా ఉన్న దృశ్యానికి టెర్రకోట కళాఖండం రూపం ఇచ్చాడు.

దానికి కొన్ని శతాబ్దాల తర్వాత ఉత్తర పెరూలో మోషో మట్టితో అలాంటి కళాఖండాలే చేశారు. భారత్‌లో అదే సమయంలో 'కామసూత్ర' కూడా వెలుగులోకి వచ్చింది.

Image copyright OTHER
చిత్రం శీర్షిక కామసూత్ర

కళాభివృద్ధిలో భాగస్వామ్యం

ఆ కళలోని ఉత్తేజిత క్షణాలను తమ కళాకృతిలో చూపించడానికి అప్పటి కళాకారులు ప్రయత్నించేవారు. అయితే, అంతమాత్రాన ఈ నైపుణ్యాలు వృద్ధి కావడం వెనుక కారణం సెక్సే అని చెప్పలేం. అలా అనుకోడానికి ఒక కారణం కూడా ఉంది.

గూటన్‌బర్గ్ ప్రింటింగ్ ప్రెస్‌నే ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ ఉద్రేకం కలిగించే పుస్తకాలు కూడా ప్రచురితం అయ్యేవి. కానీ ఆ ప్రెస్ స్థాపించడానికి ప్రధాన ఉద్దేశం మాత్రం ఆధ్యాత్మిక పుస్తకాల మార్కెట్.

ఈలోపే 19వ శతాబ్దంలో కళారంగంలోకి మెల్లమెల్లగా ఫొటోగ్రఫీ అనేది ప్రవేశించింది. 'ఆర్ట్ స్టడీస్' అనే పేరుతో అప్పట్లో పారిస్‌లోని ఒక టాప్ స్టూడియో దీనికి చాలా తళుకులీనే మార్కెట్‌ అయ్యింది.

వినియోగదారులు ఆ టెక్నాలజీ(ఫొటోగ్రఫీ) కోసం ఎక్కువ డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధపడేవారు. ఒకప్పుడు ఒక ఉత్తేజిత భంగిమ ఉన్న ఫొటో ధర, అప్పట్లో ఒక సెక్స్ వర్కర్‌కు చెల్లించే దానికంటే చాలా ఎక్కువ ఉండేది.

'పోర్నోగ్రఫీ' అనేది గ్రీకు పదం నుంచి పుట్టింది. అంటే 'రచన', 'సెక్స్ వర్కర్' అని అర్థం.

కళాత్మక వ్యక్తీకరణ తర్వాత చలనచిత్రాలు రావడంతో అవి ఒక సాంకేతిక విప్లవంగా మారిపోయింది.

కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతకంతకూ అభివృద్ధి చెందడం వెనుక 'పోర్న్' ప్రమేయం పెద్దగా లేదు. దానికి సహజ కారణాలు ఉన్నాయి. దీనికి ఉపయోగించే ఫిల్మ్ చాలా ఖరీదైనది. ఎక్కువమంది ప్రేక్షకులు వచ్చినపుడే ఆ ధర గిట్టుబాటవుతుంది.

అంటే జనం గుంపులు గుంపులుగా దాన్ని చూడాలి. అయితే పోర్న్ సినిమాలు చూడ్డానికి చాలా మంది ఖర్చు చేసేవారు. కానీ సినిమా హాళ్లలో వాటిని గుంపుగా కలిసి చూడ్డానికి మాత్రం చాలా కొద్ది మందే ధైర్యం చేసేవారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పెన్నీ పీప్-షో యాక్టర్ డెబీ రాయ్

పోర్న్, సాంకేతికాభివృద్ధి

1960వ దశకంలో పీప్-షో బూత్స్(బయోస్కోప్ లాంటిది) ట్రెండ్ మొదలైంది. వీటిలో కాయిన్ వేసి పోర్న్ సినిమాలు చూసేవాళ్లు.

ఆ సమయంలోనే ఒక్కొక్క పీప్-షో బూత్ వారానికి వేల డాలర్లు సంపాదించేది. కానీ నిజానికి పోర్న్ చూడ్డానికి ప్రేక్షకులకు ఒక వ్యక్తిగత వాతావరణం అందించింది మాత్రం 'వీడియో క్యాసెట్ రికార్డర్(వీసీఆర్)' వచ్చిన తర్వాతే అని చెప్పచ్చు.

"వీసీఆర్‌ల వల్ల పోర్న్ ఒక ఆర్థిక, సాంకేతిక పవర్‌హౌస్‌గా మారింది" అని పైచన్ బార్స్ తన 'ద ఇరోటిక్ ఇంజన్‌' పుస్తకంలో రాశారు.

ప్రారంభంలో వీసీఆర్ ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. అది రెండు వేర్వేరు రూపాల్లో వచ్చేది. వీహెచ్ఎస్, వీటామ్యాక్స్.

ఏదైనా ఒక విషయం త్వరగా పాతదైపోయేలా ఉంటే, అది ఆదాయంలో ఒక పెద్ద భాగం ఎందుకవుతుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అడల్ట్ యాక్టర్ లిండా లవ్లెస్ తర్వాత యాంటీ పోర్న్ ప్రచారకర్తగా మారారు

కేబుల్ టీవీ తర్వాత ఇంటర్నెట్

1970 దశకం ద్వితీయార్థంలో పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియో టేపులే ఎక్కువగా ఉండేవి.

కొన్నేళ్ల తర్వాత, ఇదే సాంకేతికత(వీసీఆర్) కుటుంబం అంతా కూచుని సినిమాలు చూసేంతగా చౌకగా మారిపోయింది. తర్వాత వీడియో టేపుల మార్కెట్ కూడా విస్తరించింది. అదే టైంలో పోర్న్ మార్కెట్ కుదించుకుపోయింది.

కేబుల్ టీవీ, ఇంటర్నెట్‌ కూడా అంతే

1990వ దశకంలో జరిగిన ఒక సర్వేలో అప్పట్లో షేర్ చేసుకుంటున్న ఆరు ఫొటోల్లో ఐదు పోర్నోగ్రఫీకి సంబంధించినవే ఉండేవని తేలింది.

కొన్నేళ్ల తర్వాత జరిగిన మరో పరిశోధనలో ఇంటర్నెట్ చాట్ రూం కార్యకలాపాల్లో కూడా ఇలాగే సెక్స్ సంబంధిత విషయాలే ఎక్కువగా ఉంటున్నాయని తెలిసింది.

Image copyright Getty Images

ఇంటర్నెట్‌తో జతకట్టిన సాంకేతికాభివృద్ధి

ఇదంతా చూస్తే, అప్పట్లో ట్రాకీ మాన్‌స్టర్ అన్న మాట అంత తప్పుగా ఏం అనిపించలేదు

అది చెప్పినట్టే పోర్న్ అనే ఆకలితో ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్, మంచి మోడెమ్, ఎక్కువ బ్యాండ్‌విడ్త్ కావాలనే కోరికను పెంచింది.

పోర్న్ కారణంగా జనాల్లో విస్తరించిన ఇంటర్నెట్ మిగతా రంగాల్లో కొత్త అన్వేషణలకు కూడా దారులు వేసింది.

ఈ సాంకేతికతలో ఆన్‌లైన్ పోర్న్ తయారీ వెబ్ టెక్నాలజీలో టాప్‌లో ఉంది. అంటే వీడియో ఫైల్‌ సైజును కావల్సిన సైజుకు తగ్గించడం, సులభంగా చెల్లింపులు చేయడం లాంటివి అందులోకే వస్తాయి.

మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ లాంటి బిజినెస్ మాడల్‌లో కూడా దీనికి చాలా భాగస్వామ్యం ఉంది.

ఇలాంటి ఐడియాలన్నీ టెక్నాలజీని వీలైనంత ఎక్కువమంది దగ్గరకు చేరే పద్ధతులను అన్వేషించానికి సహకరిస్తాయి. ఇంటర్నెట్ క్రమంగా విస్తరిస్తున్నకొద్దీ పోర్న్‌కు బదులు దీనిని వేరే విషయాల కోసం ఉపయోగించడం కూడా పెరిగింది.

ఇప్పుడు ప్రొఫెషనల్ పోర్నోగ్రాఫర్స్‌కు ఇంటర్నెట్ కష్టాలు మరింత పెరిగాయి. అంటే ఉదాహరణకు ఒక వార్తాపత్రిక, లేదా మ్యూజిక్ వీడియో ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరుకుతుంటే ఎవరైనా దాన్ని ఎందుకు కొంటారు. అలాగే 'పోర్న్ హబ్' లాంటి ఫ్రీ వెబ్‌సైట్లు ఉండడంతో పోర్న్ అమ్ముకోవడం కూడా కష్టంగా మారడం మామూలే.

ఉచితంగా లభించే పోర్న్‌లో ఒక పెద్ద భాగం పైరేటెడ్ ఉంటుంది. అంటే వీటిని అక్రమంగా అప్‌లోడ్ చేస్తారు. ఇలాంటి వీడియోలను తొలగించడం చాలా కష్టం.

Image copyright GABE GINSBERG
చిత్రం శీర్షిక అడల్ట్ యాక్టర్ కేసీ కాల్వర్ట్

పోర్న్ మార్కెట్

ఇప్పుడు 'కస్టమ్ పోర్న్' తయారీ కోసం ఒక కొత్త మార్కెట్ ఆవిర్భవిస్తోంది. దీని ద్వారా ప్రేక్షకులు తమకు నచ్చిన పద్ధతిలో పోర్న్ చిత్రీకరించినందుకు వారు కోరినంత చెల్లించడం జరుగుతుంది.

కానీ పోర్న్ చిత్రాలు రూపొందించేవారికి దీనివల్ల నష్టం జరుగుతుంటే, అగ్రిగేటర్ వెబ్‌సైట్లకు మాత్రం లాభాలు తెచ్చిపెడుతోంది. అలాంటి వాటికి ప్రకటనలు, ప్రీమియం కస్టమర్ల ద్వారా ఆధాయం లభిస్తుంది.

ప్రస్తుతం పోర్న్ ఇండస్ట్రీల్లో 'మైండ్‌గీక్' కంపెనీ అన్నిటికంటే ముందుంది. ప్రపంచంలోని టాప్ 10 పోర్న్ వెబ్‌సైట్లలో 'పోర్న్‌హబ్' సహా ఏడింటి యాజమాన్య హక్కులు దీని దగ్గరే ఉన్నాయి.

"మార్కెట్లో ఇలాంటి గుత్తాధిపత్యం ఒక సమస్యగా మారిందని" వాంకూవర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ మెరీనా ఎడ్షోడ్ అన్నారు.

వినియోగదారుల సంఖ్య తగ్గిపోతుంటే, నిర్మాతలపై కూడా తమ ఖర్చు తగ్గించుకోవాల్సిన ఒత్తిడి పడుతుంది.

కానీ, ఇలాంటి వాటివల్ల పోర్నోగ్రాఫర్ లాభాలు తగ్గడం ఉండదు. కానీ, పోర్న్ నటులపై ఒత్తిడి పెరుగుతుంది. అంటే మొదట్లో కాదని చెప్పిన కొన్నింటికి వారు సిద్ధపడాల్సి ఉంటుంది. అది కూడా తక్కువ ధరలకే చేయాల్సి వస్తుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పోర్నోగ్రఫీలో సెక్స్ రోబోట్ల వాడకం కూడా పెరుగుతుందా

'ఎవెన్యూ క్యూ'లో ట్రాకీ మాన్‌స్టర్ "పడుతూ లేస్తూ ఉండే మార్కెట్లో అన్నిటికంటే నమ్మకమైన పెట్టుబడి రంగం పోర్న్" అని కూడా టుంది.

పోర్న్‌లో డబ్బు ఉందనేది మాత్రం కచ్చితం.

కానీ ఇందులో డబ్బు సంపాదించే సరైన పద్ధతి ఉంది. ఆ టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడం వల్ల ఒకదాన్నొకటి ముందుకు తీసుకెళ్తుంది.

ఇంతకు ముందు ఫొటో స్టూడియో, వీసీఆర్, హై స్పీడ్ మోడెమ్ ఉండేవి. ఇప్పుడు మైండ్‌గీక్ అల్గారిదం అనేది ఐడియా ఇస్తుంది.

ట్రాకీ మాన్‌స్టర్ భవిష్యత్తు గురించి పాట పాడితే అదెలా ఉంటుందో తెలుసా. బహుశా "రోబోట్స్ ఆర్ ఫర్ పోర్న్" అని ఉండచ్చు.

అందుకే, సాంకేతికాభివృద్ధిలో సెక్స్ పాత్ర అప్పుడే ముగిసిపోవడం అనేది జరగదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు