ఇంగ్లిష్ స్పెల్లింగుల్ని మార్చేయడం కరెక్టేనా?

  • 17 జూన్ 2019
వెబ్‌స్టర్స్ Image copyright Alamy
చిత్రం శీర్షిక వెబ్‌స్టర్స్

ఇంగ్లిష్ రాసేవారంతా ఏదో ఒక సందర్భంలో స్పెల్పింగులతో కష్టాలు పడే ఉంటారు. ఇంగ్లిష్ రాత దశలోకి వచ్చినప్పటి నుంచి ఈ కష్టాలున్నాయి.

స్పెల్లింగుల్లో అస్థిరత కారణంగానే ఇంగ్లిష్ అనవసరంగా క్లిష్టంగా మారిపోయిందంటారు ఇలాంటి వారంతా.

స్పెల్లింగులను సులభతరం చేయడానికి పనిచేస్తున్న బ్రిటన్‌కు చెందిన సంస్థ 'ఇంగ్లిష్ స్పెల్లింగ్ సొసైటీ' అయితే, కష్టమైన స్పెల్లింగులకు క్రైం రేట్‌కు సంబంధముందని చెబుతోంది.

స్పెల్లింగులు కఠినంగా ఉండడమనేది నిరక్షరాస్యతకు, సరైన విద్య పూర్తిచేయలేకపోవడానికి కారణమవుతుందని.. ఇది చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అలాంటి జీవనశైలికి దారి తీస్తుందన్నది ఈ సంస్థ వాదన.

బ్రిటిష్ ఇంగ్లిష్‌లోని స్పెల్లింగులతో పోల్చితే అమెరికన్ ఇంగ్లిష్ స్పెల్లింగులు కొంత సరళంగా ఉంటాయి. ముఖ్యంగా స్థానికేతరులకు బ్రిటిష్ ఇంగ్లిష్ కంటే అమెరికన్ ఇంగ్లిష్ సులభంగా ఉంటుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక స్పెల్లింగుల పోటీలో విద్యార్థులు

అమెరికన్ ఇంగ్లిష్‌లో చాలా పదాలను ఎలా పలుకుతామో వాటి స్పెల్లింగులు అలాగే ఉంటాయి. దీనికి కారణం అక్కడ సరళమైన స్పెల్లింగుల కోసం 'నోవా వెబ్‌స్టర్స్' సాగించిన ఉద్యమమే.

అమెరికాలో ఇంగ్లిష్ స్పెల్లింగుల్లో విప్లవాత్మక మార్పులు తేవడానికి ఉద్యమించింది వెబ్‌స్టర్స్ ఒక్కరే కాదు. ఆయనకంటే ముందు ఈ ప్రయత్నం చేసిన వారున్నారు.

బెంజమిన్ ఫ్రాంక్లిన్, థియోడర్ రూజ్‌వెల్ట్ కూడా ఇలాంటి ప్రయత్నం చేశారు. ఆంగ్ల అక్షరాలలో "X" అవసరం లేదని బెంజమిన్ ఫ్రాంక్లిన్ సూచించగా.. రూజ్‌వెల్డ్ కూడా "phoenix" స్పెల్లింగ్‌ను "fenix"గా మార్చాలని సూచించారు. వీరు ఇంకా చాలా సూచనలు కూడా చేశారు.

అయితే, వీరందరికంటే వెబ్‌స్టర్స్ చేసిన సూచనలతో స్పెల్లింగుల్లో ఎక్కువ మార్పులు వచ్చాయి.

"labour"కి బదులు "labor".. "centre" బదులు "center" వంటివన్నీ వెబ్‌స్టర్స్ వ్యాప్తిలోకి తెచ్చినవే.

అయితే.. ప్రపంచంలో ఏ దేశం, ప్రాంతంలో మాట్లాడే ఇంగ్లిష్‌లో కూడా పూర్తిగా పలికే తీరు ఆధారంగా స్పెల్లింగులు ఉండవు.

ఇంగ్లిష్‌లోని చాలా సంక్లిష్ట స్పెల్లింగులు ఇతర భాషల నుంచి వచ్చి చేరిన పదాలవే అయ్యుంటాయి.

Image copyright Alamy

ఐరోపా భాషల్లో ఇంగ్లిష్ మాట్లాడడం.. రాయడం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందుకు భిన్నంగా స్పానిష్, ఫినిష్, ఇటాలియన్, చెక్, జర్మన్ భాషలు ఎలా మాట్లాడుతారో అలాగే రాస్తారని లండన్ యూనివర్సిటీ కాలేజ్‌కు చెందిన కాగ్నిటివ్ న్యూరోసైంటిస్ట్ లియరీ ఫెర్న్ పోలాక్ చెప్పారు.

దీంతో పిల్లలు ఇంగ్లిష్ రాయడం కంటే సులభంగా స్పానిష్, ఇటాలియన్‌లను నేర్చుకోగలుగుతారని పోలాక్ అభిప్రాయపడ్డారు.

అందుకే డిస్లెక్సియాతో బాధపడే చిన్నారులకు చికిత్స చేయడానికి ఇంగ్లిష్ కంటే స్పానిష్, ఇటాలియన్‌లు ఉత్తమమైన భాషలని.. బ్రిటిష్ ఇంగ్లిష్‌తో వారిని మరింత కంగారుపెట్టేకంటే పలికేతీరు ఆధారంగానే రాత కూడా ఉండే స్పానిష్, ఇటాలియన్లు మాట్లాడించడం వల్ల ఈ బాధితుల సమస్యను పరిష్కరించొచ్చన్నది పోలాక్ మాట.

ఇంటర్నెట్ కాలంలో ఇంగ్లిష్ మాటేమిటి..

నిజానికి ఇంగ్లిష్ స్పెల్లింగుల్లో మార్పులకు వెబ్‌స్టర్స్ చేసిన సూచనలు, వ్యాప్తిలోకి తెచ్చిన మార్పులు ఈ ఇంటర్నెట్ యుగానికి సరిగ్గా నప్పుతాయి.

గూగుల్‌లో కూడా ఎక్కుగా అమెరికన్ ఇంగ్లిష్ స్పెల్లింగులే కనిపిస్తాయి. "programme" అనే కాకుండా "program" అని రాసినా గూగుల్ ఓకే అంటుంది.

ప్రస్తుత కాలంలో ఎస్సెమ్మెస్‌లు, మెయిళ్లు, సోషల్ మీడియా పోస్టుల్లో సరళమైన స్పెల్లింగులు కనిపిస్తుండడమే కాకుండా సెర్చి ఇంజిన్లు కూడా ఇలాంటి పదాలకే అనుకూలంగా ఉంటున్నాయి.

అంతేకాదు... స్పెల్లింగులు సరళీకృతం కావడమే కాదు చాలా వాక్యాలకు పొట్టిపదాలూ వచ్చేశాయి ఈ ఇంటర్నెట్ యుగంలో. "LOL", "luv u" వంటివి ఎన్నో వాడుకలోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)