ఫ్రాన్స్: ఈఫిల్ టవర్ వద్ద భారీ పెయింటింగ్.. మానవాళి ఐక్యతను చాటేందుకు

  • 16 జూన్ 2019
ఈఫిల్ టవర్ ముందు వేసిన పచ్చికపై వేసిన పెయింటింగ్ Image copyright AFP

పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద పచ్చికపై ఫ్రాన్స్ కళాకారుడు ప్రత్యేకమైన భారీ చిత్రాలు వేశారు. మానవాళి ఐక్యతను చాటుతూ మనుషులు ఒకరి చేతిని మరొకరు పట్టుకొని ఉన్న ఈ భారీ చిత్రాలను ప్రకృతిలో తేలిగ్గా కలిసిపోయే పదార్థంతో వేశారు.

ఇలాంటి భారీ పెయింటింగ్‌లు వేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన్ను సాపే అని పలుస్తారు. అసలు పేరు గ్విలామే లెగ్రోస్. ఈ చిత్రాలు వేసిన కొన్ని రోజులకే ప్రకృతిలో కలిసిపోతాయి.

పెయింటింగ్ Image copyright Reuters

ఛాంప్ డే మార్స్ పార్కులో ఆరు వందల మీటర్లకు పైగా పొడవున వేసిన ఈ బొమ్మలను ఈఫిల్ టవర్‌పై నుంచి చూస్తే అబ్బురపరుస్తాయి.

ఈఫిల్ టవర్ ముందు పచ్చికపై సాపే వేసిన పెయింటింగ్ Image copyright Reuters

ఆయన గతంలో ప్రపంచవ్యాప్తంగా కొండల వాలుపై, పార్కుల్లో ఈ చిత్రాలు వేశారు.

ఇప్పుడు 'బియాండ్ వాల్స్' పేరుతో ఈ చిత్రాలు వేశారు.

మధ్యదరా సముద్రంలో ప్రయాణించేటప్పుడు అందులో మునిగిపోయే ముప్పున్న వలసదారులకు సహాయం అందించేందుకు కృషిచేసే స్వచ్ఛంద సంస్థ 'ఎస్‌వోఎస్ మెడిటరేన్' గౌరవార్థం ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈఫిల్ టవర్ ముందు వేసిన పచ్చికపై పెయింటింగ్ వేస్తున్న సాపే Image copyright EPA

గత ఏడాది మధ్యదరా సముద్రాన్ని దాటుతూ సగటున రోజుకు ఆరుగురు చనిపోయారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

మనిషికి మనిషి అంతకంతకూ దూరమవుతున్న ప్రస్తుత తరుణంలో, కలసి ఉండటం గురించి చెప్పేందుకు ఈ చిత్రాలు వేసినట్లు సాపే ద గార్డియన్ పత్రికతో చెప్పారు.

సాపే Image copyright Getty Images

లండన్, బెర్లిన్, నైరోబీ, బ్యూనస్ ఎయిర్స్ సహా ప్రపంచవ్యాప్తంగా 20 ప్రధాన నగరాల్లో సాపే ఇలాంటి పెయింటింగ్ వేయనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా తొలుత పారిస్‌లో వేశారు.

పెయింటింగ్ Image copyright AFP
పెయింటింగ్ Image copyright EPA

గమనిక: అన్ని ఫొటోలు కాపీరైట్‌కు లోబడి ఉన్నవి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)