క్రికెట్ ప్రపంచ కప్ 2019: 'పాకిస్తాన్ బౌలింగ్, భారత్ బ్యాటింగ్ మధ్యే పోటీ' -ఇంజమామ్ ఉల్ హక్

  • 16 జూన్ 2019
ఇంజమామ్ ఉల్ హఖ్ Image copyright Getty Images

వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌ ఫైనల్‌కు ముందు ఫైనల్ లాంటిదని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య జరిగే యాషెస్ పోరు కంటే ఈ మ్యాచ్‌నే జనాలు ఎక్కువగా చూస్తారని వ్యాఖ్యానించారు.

ముందు నుంచీ బ్యాటింగ్‌లో భారత్, బౌలింగ్‌లో పాకిస్తాన్ బలంగా ఉంటున్నాయని.. ఆదివారం మ్యాచ్‌లోనూ పాక్ బౌలింగ్, భారత్ బ్యాటింగ్ మధ్య పోటీ సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్, పాక్ మ్యాచ్‌కు వేదికైన మాంచెస్టర్‌లో బీబీసీ ప్రతినిధి వినాయక్ గైక్వాడ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమైనా, భారత జట్టులో చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నారని, రెండు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా ఉండబోతుందని అన్నారు.

అఫ్గానిస్తాన్ మినహా వరల్డ్ కప్‌లో అన్ని జట్లూ సమతూకంతో కనిపిస్తున్నాయని.. ఎవరు ఎవరినైనా ఓడించగలిగే పరిస్థితి ఉందని ఇంజమామ్ చెప్పారు.

పుల్వామా, బాలాకోట్ ఘటనల తర్వాత భారత్, పాక్ మ్యాచ్ ఉంటుందా అని పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ విషయంపై ఓ క్రికెటర్‌గా ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు.. ''రెండు పక్షాలను నేను ఒకటే కోరుతున్నా. ఇది ఆట. మనం అలాగే చూడాలి. ఇంతకుముందు రెండు దేశాల మధ్య చాలా సార్లు క్రికెట్ పాజిటివ్ పాత్ర పోషించింది. ఈ మ్యాచ్ కూడా అలాగే జరగాలి. గెలుపోటములు సహజం. బాగా ఆడినవారు గెలుస్తారు'' అని ఇంజమామ్ బదులు చెప్పారు.

భారత్, పాక్ మ్యాచ్‌ను ఆటలాగే చూడాలని, రెండు దేశాల మధ్య క్రికెట్ చాలా సార్లు పాజిటివ్ పాత్ర పోషించి, మంచి సందేశం పంచిందని ఆయన అన్నారు.

వరల్డ్ కప్‌లో ఇప్పటివరకూ భారత్‌పై పాక్ గెలవలేకపోయిందని, ఈసారి తమ జట్టు గెలవాలని కోరుకుంటున్నానని ఇంజమామ్ చెప్పారు.

''ఆటలో గెలుపోటములు భాగం. దీన్నో పెద్ద విషయంలా చూడకూడదు. క్రికెట్ స్వచ్ఛంగా ఉండాలి. ఇది తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్ అనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్ వల్ల రెండు జట్ల ఆటా మెరుగవుతుంది. క్రమం తప్పకుండా ఇలాంటి మ్యాచ్‌లు జరగాలి'' అని ఆయన అన్నారు.

భారత్, పాక్ మ్యాచ్‌ కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, వర్షం వల్ల ఆటకు ఇబ్బంది కలగకూడదని ఆశిస్తున్నానని తెలిపారు.

''వర్షం ఎవరి చేతుల్లోనూ లేదు. ఐసీసీ, భారత్, పాకిస్తాన్.. ఎవరైనా ఏమీ చేయలేరు. వాతావరణం వల్ల ఈ మ్యాచ్‌‌కు ఇబ్బంది రాకూడదు'' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అక్కడ గ్రహాంతర జీవులున్నాయా.. ఎవరూ రావొద్దని అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఎందుకు హెచ్చరించింది

"కుల్‌భూషణ్ జాధవ్ కేసులో ఐసీజే ఉత్తర్వును గౌరవించకపోతే పాక్‌పై ఐరాస ఆంక్షలకు ప్రయత్నిస్తాం"

ప్రెస్ రివ్యూ: మోదీది ఓ గెలుపా? ఏంపనిచేసి గెలిచారు? -కేసీఆర్

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలుచుకొచ్చిన కెప్టెన్.. వైట్ హౌస్‌లో అడుగు పెట్టబోనని ఎందుకు అన్నారు?

బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్‌లోని ఫొటోల్లో నిజమెంత

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...