ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ వరుసగా ఏడుసార్లు ఎలా గెలిచిందంటే..

  • 17 జూన్ 2019
1992 వరల్డ్ కప్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1992 ప్రంపచకప్‌

భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉందంటే.. కోట్లాది మంది ఎంతో ఉత్కంఠగా చూస్తారు. అందులోనూ ప్రంపచకప్ మ్యాచ్ అయితే, ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే, గత ప్రపంచ‌కప్‌ టోర్నమెంటు రికార్డులను పరిశీలిస్తే భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఆరు మ్యాచ్‌లూ 'వార్ వన్‌ సైడే' అన్నట్లుగానే సాగాయి. ఇప్పుడు 2019లోనూ భారత్ అదే సంప్రదాయాన్ని కొనసాగించింది.

1992 నుంచి 2015 ప్రపంచకప్‌ వరకు భారత్‌, పాక్‌లు ఆరుసార్లు తలపడగా, అన్ని సార్లూ టీమిండియానే విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. తాజాగా మాంచెస్టర్ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో ఏడోసారి టీమిండియా విజయం సాధించింది.

ఈ సందర్భంగా 7 మ్యాచ్‌ల విశేషాలను ఒకసారి చూద్దాం.

1992: 43 పరుగుల తేడాతో భారత్ విజయం

వేదిక: సిడ్నీ (ఆస్ట్రేలియా)

భారత్ స్కోర్: 216-7 (49 ఓవర్లు)

పాకిస్తాన్ స్కోర్: 173 (48.1 ఓవర్లు)

టీమిండియా కెప్టెన్: మహ్మద్‌ అజహరుద్దీన్‌

పాకిస్తాన్ కెప్టెన్: ఇమ్రాన్ ఖాన్

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: సచిన్‌ తెందూల్కర్ (62 బంతుల్లో 54*, 3x4)

1996: 39 పరుగుల తేడాతో భారత్ విజయం

వేదిక: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం

భారత్ స్కోర్: 287-8 (50 ఓవర్లు)

పాకిస్తాన్ స్కోర్: 248-9 (49 ఓవర్లు)

టీమిండియా కెప్టెన్: మహ్మద్‌ అజహరుద్దీన్‌

పాకిస్తాన్ కెప్టెన్: అమీర్ సోహైల్

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: నవజ్యోత్ సింగ్ సిద్ధు ( 115 బంతుల్లో 93 పరుగులు, 11x4)

Image copyright Getty Images

1999: 47 పరుగులతో విజయం

వేదిక: మాంచెస్టర్‌

భారత్ స్కోర్: 227-6 (50 ఓవర్లు)

పాకిస్తాన్ స్కోర్: 180 (45.3 ఓవర్లు)

టీమిండియా కెప్టెన్: మహ్మద్‌ అజహరుద్దీన్‌

పాకిస్తాన్ కెప్టెన్: వసీం అక్రమ్

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: వెంకటేశ్ ప్రసాద్ (ఐదు వికెట్ల తీశాడు)

Image copyright Getty Images

2003: 6 వికెట్ల తేడాతో విజయం

వేదిక: సెంచూరియన్ (దక్షిణాఫ్రికా)

భారత్ స్కోర్: 276-4 (45.4 ఓవర్లు)

పాకిస్తాన్ స్కోర్: 273-7 (50 ఓవర్లు)

టీమిండియా కెప్టెన్: గంగూలీ

పాకిస్తాన్ కెప్టెన్: వకార్ యూనిస్

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: సచిన్‌ తెందూల్కర్‌(75 బంతుల్లో 98; 12X4, 1x6)

* వీరేంద్ర సెహ్వాగ్‌ అప్పర్‌ కట్‌ షాట్‌ను పరిచయం చేసింది ఈ మ్యాచ్‌లోనే.

Image copyright Getty Images

2011: 29 పరుగులతో గెలుపు

వేదిక: మొహాలీ (భారత్)

భారత్ స్కోర్: 260-9 (50 ఓవర్లు)

పాకిస్తాన్ స్కోర్: 231 (49.5 ఓవర్లు)

టీమిండియా కెప్టెన్: మహేంద్ర సింగ్ ధోనీ

పాకిస్తాన్ కెప్టెన్: షాహిద్ అఫ్రీదీ

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: సచిన్ తెందూల్కర్ (115 బంతుల్లో 85; 11x4)

Image copyright Getty Images

2015: 76 పరుగులతో విజయం

వేదిక: అడిలైడ్ (ఆస్ట్రేలియా)

భారత్ స్కోర్: 300-7 (50 ఓవర్లు)

పాకిస్తాన్ స్కోర్: 224 (47 ఓవర్లు)

టీమిండియా కెప్టెన్: మహేంద్ర సింగ్ ధోనీ

పాకిస్తాన్ కెప్టెన్: మిస్బా ఉల్‌ హాక్‌

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: విరాట్‌ కోహ్లీ(126 బంతుల్లో 107; 8x4)

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రోహిత్ శర్మ

2019: 89 పరుగుల తేడాతో విజయం

వేదిక: మాంచెస్టర్

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో పాక్ విజయ లక్ష్యాన్ని 302 పరుగులుగా నిర్ణయించారు. కానీ, పాక్ 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఓపెనర్‌గా బరిలోకి దిగి 140 పరుగులు చేసిన రోహిత్ శర్మ‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. 133 బంతుల్లో 140 ( 3 సిక్సులు, 14 ఫోర్లు) చేసిన 'హిట్‌మ్యాన్' భారత గెలుపులో కీలక పాత్ర వహించాడు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు