పాదాల పరిమాణం ఎందుకు పెరిగింది?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: పాదాల పరిమాణం ఎందుకు పెరిగింది?

  • 18 జూన్ 2019

మనుషుల పాదాల పరిమాణం పెరిగిపోతోంది. ఆధునిక జీవనశైలి పిరుదులు, దంతాలు, కళ్లలాగే పాదాలనూ మార్చేస్తోంది.

గత 4 దశాబ్దాలలో మన పాదాల పరిమాణం పెరిగింది. ఎందుకు?

ఐదు లక్షల ఏళ్ల క్రితం, మనిషికి సుదీర్ఘ నడక వేట కోసం పరుగెత్తడం సాధ్యమైందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.

పాదాల కండరాలు దృఢంగా, సాగే గుణం కలిగి ఉంటాయి. అవి, ప్రతి అడుగుకూ శరీర బరువులో 15 శాతాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారుస్తాయి.

సుమారు 40 వేల ఏళ్ల క్రితం తొలిసారిగా బూట్లను తయారు చేశారు. ఆ కాలంనాటి శిలాజ అవశేషాల్లో కండరాలు కుంచించుకుపోయి ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దానిని బట్టి, బూట్ల వాడకం అప్పుడే మొదలైందని చెప్పొచ్చు.

బూట్ల వాడకం మొదలైనప్పటి నుంచే పాదాలు బలహీనపడ్డాయి.

నడక తగ్గింది

గతంతో పోల్చితే ఇప్పుడు కాలినడకన తిరగడం చాలా తగ్గిపోయింది. పనిచేసే ప్రదేశాల్లోనూ అటుఇటూ నడిచే అవసరాలు లేకుండాపోతున్నాయి.

ధనిక దేశాల్లో 80 శాతానికి పైగా పనులు కుర్చీలో కూర్చుని చేసేవే. రకరకాల గృహోపకరణాలు అందుబాటులోకి వచ్చాక, ఇళ్లల్లోనూ కూర్చోవడం ఎక్కువైపోయింది.

ఎక్కువగా బూట్లు ధరించడం, తక్కువగా నడవడం వల్ల పాదాల కండరాలు బలహీనపడతాయి.

మన పాదాలు ఫ్లాట్‌గా (వంపులు లేకుండా) మారాయి కాబట్టి వాటి పరిమాణం పెరిగినట్లుగా కనిపిస్తాయి. ధనిక దేశాల్లో దాదాపు 30 శాతం మంది పాదాలు ఫ్లాట్‌గా ఉన్నాయి.

ఇది మనం నిలబడే తీరును ప్రభావితం చేస్తుంది, కీళ్ళు, వెన్నెముకలో సమస్యలొస్తాయి. దాంతో, మనలో చురుకుదనం, జీవన నాణ్యత తగ్గిపోతుంది.

సౌకర్యవంతంగా ఉండే షూలను ఎంచుకోవాలి. డోమింగ్, మడమ పైకెత్తడం లాంటి వ్యాయామాలు కండరాలు మళ్లీ దృఢంగా మారేందుకు సాయపడతాయి. దాంతో, కోల్పోయిన పాదాల దృఢత్వాన్ని తిరిగి పొందవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు