వీడియో: భారీ విమానాన్ని సముద్రంలో ముంచేసిన టర్కీ
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: భారీ విమానాన్ని సముద్రంలో ముంచేసిన టర్కీ

  • 20 జూన్ 2019

ఒక భారీ విమానాన్ని సముద్రంపైకి తీసుకువచ్చి, దాన్ని సముద్రపు నీళ్లలో ముంచేశారు. టర్కీకి వాయువ్య దిశలోని సారోస్ తీరంలో ఈ సంఘటన జరిగింది.

ఎయిర్ బస్ ఎ 330 విమానాన్ని ఇబ్రైస్ పోర్టు నుంచి మోటారు బోట్ల సహాయంతో తీరం నుంచి సముద్రంలోకి కిలోమీటరు దూరం తీసుకెళ్లారు. తర్వాత దాన్ని నీళ్లలో ముంచేశారు.

90 టన్నుల బరువున్న ఈ ప్రయాణీకుల విమానాన్ని ఉపరితలానికి 30 మీటర్ల లోతులో ముంచేందుకు ఇంజనీర్లకు నాలుగు గంటల సమయం పట్టింది.

సముద్ర జీవులకు ఆవాసంగా ఈ విమానం ఉపయోగపడుతుందని, అలాగే స్కూబా డైవర్లను కూడా ఆకర్షిస్తుందని, అందుకే ఈ విమానాన్ని సముద్రంలో ముంచినట్లు టర్కీ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)