వీడియో: పది లక్షల మంది ముస్లింలను నిర్బంధించిన చైనా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: పది లక్షల మంది ముస్లింలను నిర్బంధించిన చైనా

  • 19 జూన్ 2019

ఎలాంటి నేరానికి పాల్పడనప్పటికీ, ఏ రకమైన విచారణ లేకుండానే.... చైనాలో పది లక్షల మందికి పైగా ముస్లింలను డిటెన్షన్ కేంద్రాల్లో నిర్బంధించారు. పశ్చిమ ప్రాంతంలోని షిన్ జియాంగ్ లో ఉన్న ఇలాంటి కొన్ని కేంద్రాలను పరిశీలించేందుకు బీబీసీకి అరుదైన అనుమతి లభించింది.

మొదట్లో చైనా తమ దేశంలో అసలు ఇలాంటి శిబిరాలే లేవంటూ తోసిపుచ్చుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం.. అవన్నీ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తాము నడుపుతున్న పాఠశాలలని చెబుతోంది.

పెద్ద పెద్ద సురక్షితమైన భవనాల్లో లక్షలాది మంది ముస్లింలను నిర్బంధిస్తున్నారనే ఆరోపణలను చైనా ఇంతకాలం తిరస్కరిస్తూ వచ్చింది.

కానీ, ఇప్పుడు మాకు వీటి లోపలికి వెళ్లేందుకు అనుమతి లభించింది. ఇందులో ఉన్నవారెవరూ బందీలు కాదనీ.. విద్యార్థులు మాత్రమేననీ... అలాగే ఈ తరహా బ్రెయిన్ వాషింగ్ కోసం వీరంతా స్వచ్ఛందంగానే ఇక్కడికి వచ్చారనే సందేశం ఇవ్వాలనుకుంటోంది చైనా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)