విరాట్ కోహ్లీ: భారత్ Vs వెస్టిండీస్‌ మ్యాచ్‌లో సచిన్, లారాల రికార్డుని బ్రేక్ చేసిన టీమిండియా కెప్టెన్

  • 28 జూన్ 2019
కోహ్లీ Image copyright Getty Images

క్రికెట్ వరల్డ్ కప్‌లో గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ గొప్ప మైలు రాయిని దాటాడు.

మ్యాచ్‌లో 75 పరుగులు చేసిన కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో 20 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల క్లబ్‌లో చేరాడు.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రయాన్ లారాలను దాటుకుంటూ, అత్యంత వేగంగా ఈ మైలు రాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డు సాధించాడు.

కోహ్లీ ఇప్పటివరకూ మొత్తం 417 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో 131 టెస్టులు, 224 వన్డేలు, 62 టీ20లు ఉన్నాయి.

సచిన్, లారా 453 మ్యాచ్‌ల తర్వాత ఈ మైలు రాయిని చేరారు.

వీరి తర్వాతి స్థానం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ది. 468 మ్యాచ్‌ల తర్వాత అతను 20 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.

Image copyright Getty Images

20 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆటగాడు కోహ్లీ.

సచిన్, కోహ్లీలతోపాటు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ క్లబ్‌లో ఉన్నాడు.

సచిన్ తన మొత్తం కెరీర్‌లో 34,357 పరుగులు చేశాడు. ద్రవిడ్ 24,208 పరుగులు చేశాడు.

కోహ్లీ తాజా రికార్డును చేరుకున్న తర్వాత సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసల వర్షం కురిసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)