బేబీ 'ఇండియా'ను మాకివ్వండి, మేం పెంచుకుంటాం

అమెరికాలో ప్లాస్టిక్ సంచిలో దొరికిన శిశువును దత్తత తీసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఆసక్తిచూపుతున్నారని అధికారులు తెలిపారు.
ఈ శిశువును ముద్దుగా ఇండియా అని పిలుస్తున్నారు. జూన్ 6న జార్జియాలో ఈ శిశువు దొరికింది. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్లాస్టిక్ సంచిలో చుట్టి ఉన్న శిశువును బయటకు తీయడం పోలీసు కెమెరాలో రికార్డైంది. ఈ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.
చిన్నారిని పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు. బేబీకి ఎలాంటి ముప్పూ లేదని, ప్రస్తుతం కోలుకుంటోందని పరీక్షించిన డాక్టర్లు వెల్లడించారు.
మూడు వారాలు గడిచాయి. శిశు సంరక్షణ సంస్థలో పెరుగుతున్న బేబీ 'ఇండియా' పూర్తిగా కోలుకుంది. తన వద్దకు వచ్చినవారిని చూసి నవ్వుతోంది.
ఓ శాశ్వత నివాసం దొరికేవరకూ 'ఇండియా' ఇక్కడే ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులెవరో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
బేబీ ఇండియా గురించి కొత్తగా పంచుకోవాల్సిన సమాచారం ప్రస్తుతానికి ఏమీ లేదు అని ఫేస్బుక్లో ప్రకటించారు.
- దలైలామా ఇంటర్వ్యూ: 'మహిళా దలైలామా అయితే ఆకర్షణీయంగా ఉండాలి'
- బిహార్: వేధింపులను అడ్డుకున్నందుకు తల్లీకూతుళ్లకు గుండు కొట్టించి ఊరేగించారు
ఈ చిన్నారిని దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్న కుటుంబాల సంఖ్యకు లోటేమీ లేదని జార్జియాలోని ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ సర్వీస్ విభాగం డైరెక్టర్ టామ్ రౌలింగ్స్ తెలిపారు.
బేబీ ఇండియాకు శాశ్వత నివాసాన్ని కల్పించేందుకు ఎంతో మంది ఆసక్తిని వ్యక్తీకరించారు అని ఆయన ఏబీసీ టీవీకి చెందిన 'గుడ్ మార్నింగ్ అమెరికా' కార్యక్రమ నిర్వాహకులతో అన్నారు.
బేబీ ఇండియాను నాటకీయంగా రక్షించడం, ఇదంతా అంతర్జాతీయ వార్తా ప్రసార మాధ్యమాల్లో ప్రధానంగా రావడంతో వందలాది కుటుంబాలు చిన్నారిని దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయని, తమను సంప్రదిస్తున్నాయని రౌలింగ్స్ తెలిపారు.
"నా జీవితంలో ఇప్పటి వరకూ చూసిన అద్భుతం.. ఈ చిన్నారి బతికి బట్టకట్టడమే. స్థానికులు గమనించే సమయానికి చిన్నారి బొడ్డు పేగు కూడా కట్ చెయ్యలేదు" అని రౌలింగ్స్ చెప్పారు.
ఇవి కూడా చదవండి.
- ఆంధ్రప్రదేశ్‌లో క్రిమినల్ కేసులున్న మంత్రులెందరు.. వారిలో అత్యంత సంపన్నులెవరు
- ఏ రాజకీయ నాయకులూ పట్టించుకోని ప్రధాన సమస్య ఇదే
- గ్యాంగ్‌లో గుర్తింపు రావాలంటే మనుషుల్ని చంపుతూనే ఉండాలి
- 'ఇండియా గెలవాలి... దేవుడా' అని పాకిస్తానీలు ఎందుకు కోరుకుంటున్నారు?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- మనిషి మాట్లాడడం ఎప్పుడు మొదలుపెట్టాడు...
- అబ్బూరి ఛాయాదేవి: 'ఆమె చైతన్యరూపిణి... తుళ్ళిపడే తొలకరి రోజుల గోదావరి'
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- ధోనీ స్లో బ్యాటింగ్‌పై విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)