వరల్డ్ కప్: భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సందడి చేసిన ఆ బామ్మ ఎవరంటే..

  • 3 జూలై 2019
క్రికెట్, బామ్మ, కోహ్లీ Image copyright Reuters

వరల్డ్ కప్‌లో బుధవారం భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ చాలా ఆసక్తకరంగా సాగింది.

రోహిత్ శర్మ సెంచరీ కొట్టడంతో భారత్ 314 స్కోరు సాధించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను 286 పరుగులకే కట్టడి చేసి, 28 పరుగుల తేడాతో గెలిచింది. భారత బౌలర్ బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు.

అయితే, మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో ఈ ఆటగాళ్ల గురించి కన్నా, ఓ అభిమాని గురించి జనాలు ఎక్కువగా చర్చించుకున్నారు.

ఆమే 87 ఏళ్ల చారులత పటేల్.

స్టేడియంలో టీమ్ ఇండియాను ఉత్సాహపరుస్తూ ఆమె కనిపించారు.

భారత జెండాను ఊపుతూ, పీక ఊదుతూ మ్యాచ్‌ను ఆస్వాదించారు.

టీవీల్లోనూ ఈ దృశ్యాలు ప్రసారమయ్యాయి.

దీంతో, సోషల్ మీడియాలో ఆమె గురించి చర్చ మొదలైంది.

ఇంత వయసులోనూ క్రికెట్, టీమ్ ఇండియా పట్ల అభిమానం చూపుతున్నందుకు ఆమెను ప్రశంసిస్తూ చాలా మంది పోస్ట్‌లు, ట్వీట్‌లు చేయడం ప్రారంభించారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా చారులత పీక ఊదుతున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వరల్డ్ కప్‌ టోర్నీ మొత్తంలో తన దృష్టిలో అత్యుత్తమ చిత్రం అదేనని అన్నారు.

మ్యాచ్ తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ చారులతను కలిశారు. ఆ ఫొటోలను ట్విటర్‌లోనూ పెట్టారు. భారత్‌కు అతిపెద్ద అభిమాని చారులతేనని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

క్రికెట్ వరల్డ్ కప్ అధికారిక ట్విటర్ అకౌంట్ కూడా ఆమె గురించి పోస్ట్‌లు చేసింది.

చారులత టాంజానియాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు భారతీయలు.

తమ పిల్లలు కౌంటీ క్రికెట్ ఆడేవారని, ఆట పట్ల తనకు ఆసక్తి అలా పెరిగిందని చారులత చెప్పారు.

ఉద్యోగ విరమణ తర్వాత ఎప్పుడు వీలు దొరికినా, మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియం వస్తుంటానని వివరించారు

ఐపీఎల్-2019లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. తన అభిమాని అయిన ఓ పెద్దావిడను స్టార్ క్రికెటర్ ధోని కలిశాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

టర్కీ బహిష్కరించిన ఐఎస్ జిహాదీల పరిస్థితి ఏమిటి... తమ దేశం వద్దంటే వారు ఎటు పోవాలి

నీటిపై తేలియాడే వెనిస్‌ను ముంచెత్తిన వరదలు

సోషల్ మీడియాతో లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు... ఎలా

'దెయ్యాలను 12 ట్రక్కుల్లో మూడు రోజుల పాటు మరో చోటుకు తరలించాం'

భాయిచంద్ పటేల్: 'ఆ అమ్మాయిలకు తిరగడానికి తెల్లవాళ్ళు, పెళ్లికి మాత్రం మనలాంటి వాళ్లు కావాలి'

ప్రెస్ రివ్యూ: 'జగన్‌తోనే నా ప్రయాణం... చంద్రబాబు ఇసుకదీక్ష సరికాదు' - టీడీపీ ఎమ్మెల్యే వంశీ

కరసేవకుడి నుంచి ప్రధాని వరకు... మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది...

పాకిస్తాన్: 10 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ మ్యాచ్: శ్రీలంక జట్టుకు ఎందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు