ENGvNZ: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఇంగ్లండ్... 1992 తర్వాత తొలిసారి, పాక్, శ్రీలంక సెమీస్ ఆశలు ఆవిరి

క్రికెట్ ప్రపంచకప్‌లో బుధవారం మరో ఆసక్తికర సమరం జరిగింది. ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్లు సెమీస్ బెర్తు కోసం తలపడ్డాయి.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది.
306 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్ 45 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఈ విజయంతో ఇంగ్లండ్ మొత్తం 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
ఓటమి పాలైన న్యూజీలాండ్ 11 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
ఇంగ్లండ్ విజయంతో పాకిస్తాన్, శ్రీలంక సెమీస్ ఆశలు ఆవిరి అయ్యాయి.
1992 తర్వాత ఇంగ్లండ్ మళ్లీ ప్రపంచ కప్ సెమీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి.
సెంచరీ చేసిన జానీ బెయిర్‌స్టో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
భారత్-శ్రీలంక, ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితాల తర్వాత సెమీస్ పోరుపై ఒక స్పష్టత రానుంది.
న్యూజీలాండ్ కష్టాలు
తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన న్యూజీలాండ్ లక్ష్యం అందుకునేందుకు ఏ దశలోనూ పోరాటం చేయలేకపోయింది.
ఓపెనర్లు 14 పరుగులకే పెవిలియన్ చేరడంతో జట్టును మొదటి నుంచే కష్టాలు వెంటాడాయి.
కెప్టెన్ విలియమ్సన్(27), టేలర్(28) వెంటవెంటనే రనౌట్లు కావడంతో జట్టును ఆదుకునేవారే లేకుండాపోయారు.
జట్టులో వికెట్ కీపర్ లాథమ్ 57 పరుగులే అత్యధిక స్కోరు.
తర్వాత వచ్చినవారిలో నీషామ్(19), శాంట్నర్(12) మాత్రమే రెండంకెల స్కోరుకు చేరగలిగారు.
ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్ 3 వికెట్లు పడగొట్టగా, వోక్స్, ఆర్చర్, ప్లంకెట్, రషీద్, స్టోక్స్ ఒక్కో వికెట్ తీశారు.
ఇంగ్లండ్ ఓపెనర్ల జోరు
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఓవరు నుంచే ధాటిగా ఆడింది.
ఓపెనర్లు బెయిర్‌స్టో, జాసన్ రాయ్ వంద పరుగుల భాగస్వామ్యం అందించారు.
123 పరుగుల దగ్గర జాసన్ రాయ్(66) ఔటైనా జో రూట్(24)తో కలిసి బెయిర్ స్టో స్కోరును పరిగెత్తించాడు. 200 దాటించాడు.
సెంచరీ కూడా పూర్తి చేసుకున్న బెయిర్‌స్టో తర్వాత కాసేపటికే ఔట్ అయ్యాడు.
బెయిర్‌స్టో 99 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 106 పరుగులు చేశాడు.
బెయిర్‌స్టో ఔట్ అయ్యాక ఇయాన్ మోర్గాన్(42) మినహా ఎవరూ క్రీజులో నిలదొక్కుకోకపోవడంతో ఒక దశలో 350 పరుగులకు పైనే చేస్తుందని భావించిన ఇంగ్లండ్ కష్టంగా 300 పరుగులు క్రాస్ చేసింది.
బట్లర్ 11, స్టోక్స్ 11, వోక్స్ 4, రషీద్ 15 పరుగులు చేశారు. ప్లంకెట్ 15, ఆర్చర్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచారు.
న్యూజీలాండ్ బౌలర్లలో నీషామ్, హెన్రీ, బౌల్ట్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. శాంట్నర్, సౌథీ చెరో వికెట్ తీశారు.
తడబడిన న్యూజీలాండ్....
45వ ఓవర్ చివరి బంతికి ఆలౌట్
ట్రెంట్ బౌల్ట్(4) రషీద్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
43వ ఓవర్లో 9వ వికెట్...
181 పరుగుల దగ్గర తొమ్మిదో వికెట్ పడింది
మాట్ హెన్రీ 7 పరుగులకు వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఇది వుడ్‌కు మూడో వికెట్
40 ఓవర్లకు 171/8...
40వ ఓవర్లో ఎనిమిదో వికెట్
166 పరుగుల దగ్గర వుడ్ బౌలింగ్‌లో శాంట్నర్ ఎల్బిడబ్ల్యు అయ్యాడు.
న్యూజీలాండ్ రివ్యూ కోరినా రీప్లేలో ఔట్ అని తేలింది.
శాంట్నర్ 12 పరుగులు చేశాడు.
39 ఓవర్లలో 166/7...
164 పరుగులకు ఏడో వికెట్ పడింది.
39వ ఓవర్లో లాథమ్(57) ఔట్ అయ్యాడు.
ప్లంకెట్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఆరో వికెట్ డౌన్... కష్టాల్లో న్యూజీలాండ్
మరో ఐదు పరుగులకే ఆరో వికెట్ పడింది.
29వ ఓవర్లో స్టోక్స్ బంతికి గ్రాండ్‌హోమే కొట్టిన షాట్ బౌండరీ లైన్ దగ్గర రూట్ చేతుల్లో పడింది.
గ్రాండ్‌హోమే 3 పరుగులే చేశాడు.
26 ఓవర్లలో 123/5...
26వ ఓవర్లో ఐదో వికెట్ డౌన్..
123 పరుగుల దగ్గర నీషామ్(19) ఔట్ అయ్యాడు.
వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
20 ఓవర్లలో 87/4..
న్యూజీలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.
జేమ్స్ నీషామ్(9), టామ్ లాథామ్(11) పరుగులతో క్రీజులో ఉన్నారు.
18 ఓవర్లలో 75/4..
రాస్ టేలర్ ఔట్
17వ ఓవర్లో న్యూజీలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది.
69 పరుగుల దగ్గర రాస్ టేలర్(28) కూడా రనౌట్ అయ్యాడు.
16 ఓవర్లలో 68/3...
కెప్టెన్ కేన్ విలియమ్సన్ రనౌట్
16వ ఓవర్లో కేన్ విలియమ్సన్ ఔట్ అయ్యాడు.
వుడ్ బౌలింగ్‌లో టేలర్ షాట్ కొట్టగా బంతి బౌలర్ వేలు రాసుకుంటూ అవతలి ఎండ్‌లో ఉన్న వికెట్లకు తగిలింది.
ఆ సమయంలో విలియమ్సన్ క్రీజులో లేనట్లు రీప్లేలో స్పష్టంగా తెలీడంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు.
కేన్ విలియమ్సన్ 27 పరుగులు చేశాడు.
టేలర్ 26 పరుగులు, లాథమ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
ఆరో ఓవర్లో గప్తిల్ ఔట్
14 పరుగుల దగ్గర రెండో వికెట్ పడింది.
8 పరుగులు చేసిన ఓపెనర్ గప్తిల్ ఆర్చర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
తొలి ఓవర్లోనే వికెట్
306 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది.
జట్టు స్కోరు 2 పరుగుల దగ్గర ఓపెనర్ నికొలస్(0) వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యు అయ్యాడు.
మరో ఓపెనర్ గప్తిల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఇంగ్లండ్ 50 ఓవర్లలో 300/8..
50వ ఓవర్లో 300 మార్కు దాటిన ఇంగ్లండ్
ఇదే ఓవర్లో ఇంగ్లండ్ 8వ వికెట్ కూడా కోల్పోయింది.
అదిల్ రషీద్(16) సౌథీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
ప్లంకెట్(15), ఆర్చర్(1) నాటౌట్‌గా నిలిచారు.
47 ఓవర్లలో 277/7...
ఇయాన్ మోర్గాన్ ఔట్
272 పరుగుల దగ్గర ఇంగ్లండ్ ఏడో వికెట్ పడింది.
42 పరుగులు చేసిన హెన్రీ బౌలింగ్‌లో శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఈ వికెట్ 47వ ఓవర్లో పడింది.
259 దగ్గర ఆరో వికెట్
45వ ఓవర్లో ఇంగ్లండ్ క్రిస్ వోక్స్ వికెట్ కోల్పోయింది.
వోక్స్(4) నీషామ్ బౌలింగ్‌లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చాడు.
ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది.
248 పరుగుల దగ్గర స్టోక్స్(11) ఔట్ అయ్యాడు.
42 ఓవర్ వేసిన శాంట్నర్ బంతికి షాట్ కొట్టబోయి హెన్రీకి క్యాచ్ ఇచ్చాడు.
40 ఓవర్లలో 241/4...
4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 40 ఓవర్లు పూర్తయ్యేసరికి 241 పరుగులు చేసింది.
ఇయాన్ మోర్గాన్(24), స్టోక్స్(7) పరుగులతో క్రీజులో ఉన్నారు.
214 పరుగులకు బట్లర్ బౌల్డ్
35వ ఓవర్లో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది.
11 పరుగులు చేసిన జాస్ బట్లర్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఇయాన్ మోర్గాన్, స్టోక్స్ క్రీజులో ఉన్నారు.
ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్
206 పరుగుల దగ్గర ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది.
సెంచరీ చేసిన జానీ బెయిర్‌స్టో(106) హెన్రీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
బెయిర్‌స్టో 99 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 106 పరుగుల చేశాడు.
31వ ఓవర్లో జో రూట్ ఔట్
194 పరుగుల దగ్గర ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది.
24 పరుగులు చేసిన జో రూట్ బౌల్ట్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఇదే ఓవర్లో ఇంగ్లండ్ 200 పరుగుల మైలురాయిని చేరుకుంది.
123 పరుగులకు ఇంగ్లండ్ తొలి వికెట్
60 పరుగులు చేసిన జాసన్ రాయ్ ఔట్ అయ్యాడు.
నీషామ్ బౌలింగ్‌లో శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
17 ఓవర్లకు 111/0
17 ఓవర్లకు ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 111 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
జానీ బెయిర్‌స్టో 52, జాసన్ రాయ్ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.
15వ ఓవర్లో ఇంగ్లండ్ 100 పరుగుల మైలురాయిని దాటింది.
ఓపెనర్లు జాసన్ రాయ్
7వ ఓవర్లో ఇంగ్లండ్ 50 పరుగులు.
5 ఓవర్లకు 44/0
ఇంగ్లండ్ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, జాసన్ రాయ్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించారు.
బెయిర్‌స్టో 23, జాసన్ రాయ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండు జట్లకు మ్యాచ్ కీలకం
ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది.
ఓడిన జట్టు ఇతర మ్యాచ్‌ల ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంది.
ఆస్ట్రేలియా, భారత్ ఇప్పటికే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.
మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి ఈ రోజు మ్యాచ్ విజేతకు దక్కుతుంది. మరో బెర్తు కోసం ఓడిన జట్టు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య పోటీ ఉంటుంది.
ఇవి కూడా చదవండి.
- India Vs Bangladesh: ప్రపంచ కప్ సెమీస్‌లో భారత్... బంగ్లాదేశ్‌పై 28 పరుగుల తేడాతో విజయం
- Eng Vs Aus : లార్డ్స్‌లో ఆస్ట్రేలియా విజయం.. ఇంగ్లండ్‌కు వరుసగా రెండో ఓటమి..
- PAK Vs SA: దక్షిణాఫ్రికాపై 49 పరుగుల తేడాతో పాక్ విజయం.. సెమీస్ రేసు నుంచి సౌతాఫ్రికా ఔట్
- ఇరాన్ అధ్యక్షుడే లక్ష్యంగా ట్రంప్ కొత్త ఆంక్షలు.. ఇది యుద్ధ దాహమే అంటున్న అధికారులు
- గడ్డి వంతెన ఇది... దీన్ని ఎలా కడతారో చూడండి
- 'ఇరాన్ ఆయుధ వ్యవస్థలపై అమెరికా సైబర్ దాడి'
- ఇంతమంది చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు...
- మీ లంచ్‌ని తోటి ఉద్యోగి దొంగిలిస్తే.. అదో వైరల్!
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)