అమెజాన్ ఆదివాసి తెగ: బ్రెజిల్ ప్రభుత్వంతో పోరాడుతున్న ఈ తెగ జనాభా 120 మాత్రమే

  • 7 జూలై 2019
అమెజాన్ ఆదివాసి తెగ

అమెజాన్ అడవులు అరుదైన జీవజాతులకే కాదు ఎన్నో ఆదివాసీ తెగలకు కూడా ఆలవాలం.

అడవుల నరికివేతతో ఈ తెగల మనుగడ ప్రమాదంలో పడుతోంది.

తమకు ప్రాణపదమైన అమెజాన్ అడవులు తరిగిపోతుండటంతో బ్రెజిల్‌లోని ఆదివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

700 రక్షిత అటవీ ప్రాంతాల్లోనూ చెట్ల నరికివేతకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో తమ సంస్కృతి, సంప్రదాయాలకు, తమ జీవన విధానానికి ముప్పు ఏర్పడుతుందని వారు భయపడుతున్నారు. ఈ పరిణామాలపై బీబీసీ సైన్స్ ఎడిటర్ డెవిడ్ సుఖమన్ అందిస్తున్న కథనం.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: అమెజాన్ ఆదివాసీ తెగ: వీరి జనాభా 120 మాత్రమే

తొలి ఘర్షణ చేదు జ్ఞాపకాలు మర్చిపోలేదు

అడవుల నరికివేతను ఎదుర్కోవడంపై అమెజాన్ ఆదిమవాసుల్లో పెద్ద చర్చే జరుగుతోంది.

తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం వచ్చిందని వారు భావిస్తున్నారు.

మైదాన ప్రాంతాల వారితో జరిగిన తొలి ఘర్షణకు సంబంధించిన చేదు జ్ఞాపకాలను పయజుబే ఇంకా మరచిపోలేదు.

గతంలో ఆదివాసుల మీద జరిగిన దాడిలో ఆయన భార్య బురేహా గాయపడ్డారు. ఆమె కుటుంబాన్ని చంపేశారు. ఇక్కడ భూ వివాదాలకు పెద్ద చరిత్రే ఉంది. అందుకే ఇప్పుడు ఆమె మళ్లీ భయపడుతున్నారు.

'గతంలో జరిగినట్లే ఇప్పుడూ జరగొచ్చనే భయం వేస్తోంది. ఆ భయంతోనే ప్రతిరోజూ చాలా పొద్దున్నే నిద్రలేస్తున్నాను' అని ఆదివాసి మహిళా బొరేహా చెప్పారు.

ఈ తెగ జనాభా 120 మాత్రమే

'ఉరు ఉ వావ్ వావ్' అని పిలిచే అరుదైన తెగకు చెందిన వీరి జనాభా 120 మంది మాత్రమే.

యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు ఉపయోగించే రంగును వారు తయారు చేస్తున్నారు.

బ్రెజిల్‌లోని కొత్త ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఉన్నందున, తమను తాము రక్షించుకోవాలని వారు భావిస్తున్నారు.

రక్షిత అటవీ ప్రాంతంలో వారు గస్తీ కాస్తున్నప్పుడు, కలప కోసం లేదా పొలాల కోసం మైదాన ప్రాంత వాసులు ఇక్కడకు వచ్చిన జాడలు వీరి కంటపడుతూనే ఉన్నాయి.

వీరిని ఒకప్పుడు అటవీ సంరక్షకులుగా చూసేవారు. కానీ ఇప్పుడు కొత్త అధ్యక్షుడు బొల్సనారో ఆక్రమణదారులను ప్రోత్సహిస్తున్నారని వీరు అంటున్నారు.

'మా పవిత్రమైన భూమిని లాక్కోవాలని బోల్సనారో ప్రయత్నిస్తున్నారు. వాటిపై మేం ఆధారపడి బతక్కూడదని ఆయన అంటున్నారు' అని వారు చెప్పారు.

రక్షిత అడవులు మెల్లగా వ్యవసాయ క్షేత్రాలుగా మారిపోతున్నాయి. ఆదివాసులకు పరిమితికి మించి భూములున్నందున వాటిని రైతులకు ఇస్తామని అధ్యక్షుడు చెబుతున్నారు.

గత 20 ఏళ్లలో అడవులు ఎలా విధ్వంసానికి గురయ్యాయో శాటిలైట్ చిత్రాల ద్వారా పరిశీలించామని అన్నారు..

పెరుగుతున్న భూ వివాదాలు

ఈ భూ వివాదాల వల్ల ఘర్షణలు పెరిగిపోతున్నాయి.

సాగు భూముల కోసం అడవులను నరకాలన్న అధ్యక్షుడి నిర్ణయాన్ని ఈ రైతులు మెచ్చుకుంటున్నారు.

'బెత్తెడు భూమి కూడా లేని ప్రజలు ఎంతో మంది ఉన్నప్పుడు... ఇన్ని అడవులు దేనికి..? ఈ పర్యావరణ సంరక్షణ ఎందుకు..? మాకు కావాల్సింది కొద్దిపాటి భూమి మాత్రమే. వారు భూమి ఇవ్వకుంటే మాకు ఇక బతుకు దెరువు ఏది? ఆ భూములపై మాకూ హక్కు ఉంది' అని ఇక్కడి రైతులు అంటున్నారు.

మొత్తానికి ఈ అడవులు భవిష్యత్తు చాలా భిన్నంగా ఉండొచ్చు.

అడవుల్లో నివసించే ఆదిమవాసుల సమీపంలోనే రైతులు కూడా తమ పొలాలను దున్నకుంటూ కనిపిస్తారేమో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నన్నయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు, సీఎం జగన్‌కు లేఖ, ప్రొఫెస‌ర్ సస్పెన్షన్

‘టార్జాన్’ భార్యను పొడిచి చంపిన కొడుకు.. అతడిని కాల్చిచంపిన పోలీసులు

యుద్ధభూమిలో అమ్మానాన్న మృతి.. చిక్కుకుపోయిన విదేశీ చిన్నారులు.. వీళ్లు ఇళ్లకు చేరేదెలా

ఎరిత్రియా: ఇక్కడ సిమ్‌ కార్డులు బంగారంతో సమానం... ఏటీఎంల గురించే వారికి తెలియదు

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా

‘ఆర్టీసీ కార్మికులతో చర్చల్లేవ్’ - ప్రెస్ రివ్యూ

సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్‌షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్‌'

ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై ఎక్కిన కిమ్