మనిషి చరిత్రను తిరగరాయగల పుర్రె ఇది
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: మనిషి చరిత్రను తిరగరాయగల పుర్రె ఇది

  • 14 జూలై 2019

మానవ జాతి చరిత్రను తిరగరాయగల పరిశోధన ఇది. రెండు లక్షల పది వేల ఏళ్లనాటి మానవునికి సంబంధించిన ఒక పుర్రెను ఆఫ్రికా వెలుపల పరిశోధకులు కనుగొన్నారు.

ఇప్పటివరకూ హోమోసెపియన్స్ ఆఫ్రికా నుంచి మొదట ఐరోపాకు వచ్చినట్లు చరిత్ర ఉంది. ఐరోపాలోని గ్రీస్‌లో గుర్తించిన ఈ పుర్రె ఈ చరిత్రను తిరగరాస్తుందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

మానవుని పరిణామ క్రమం మొదటగా ఆఫ్రికాలో ప్రారంభమైంది. ఐరోపా, ఆసియాల్లో నియాన్‌డెర్తాల్స్, డెనిసోవన్స్ లాంటి మానవ జాతులు అంతరించిపోయాయి. మనం ఇప్పటివరకు చదువుకున్నదాని ప్రకారం- మన పూర్వీకులు ఆఫ్రికా ఖండం నుంచి క్రమంగా ప్రపంచంలో విస్తరించారు.

దక్షిణ గ్రీస్‌లోని అపిడిమాలో కనుగొన్ని మానవ పుర్రె ఈ భావనను మార్చేలా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)